కేసీఆర్ ఎటు వస్తారు ...?

ఏపీ పాలిటిక్స్ లో దాదాపు ఎంటర్ అయిపోయారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఆయన వచ్చే కీలక ఎన్నికలముందు ఎటు నుంచి వస్తారో అర్ధం కాక అయోమయంలో పడ్డారు తెలుగు తమ్ముళ్ళు. వచ్చే గులాబీ బాస్ తుఫాన్ నుంచి తమను కాపాడుకోవడంతో బాటు పార్టీని గట్టెక్కించే వ్యూహాలు ఇప్పటినుంచి సిద్ధం చేసే ప్రక్రియకు యుద్ద ప్రాతిపదికన చేపట్టిసింది పసుపు పార్టీ. కేసీఆర్ తన తాజా ప్రెస్ మీట్ తో ఎపి లోకి తనదైన రాజకీయ ఎత్తుగడలతో దిగుతున్నట్లు శంఖం ఊదేశారు. ఇది ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు శిబిరంలో నిద్ర లేకుండా చేస్తుంది.
పరిశీలిస్తున్న టిడిపి థింక్ ట్యాంక్ ...
ప్రస్తుతం రాజకీయాల్లో మంచి ఫామ్ లో వున్నారు గులాబీ బాస్. తన మాటతో మొత్తం ప్రజల మైండ్ సెట్ ను సెట్ చేసే చతురత కేసీఆర్ కు ఉన్నట్లు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేదన్నది నిర్వివాదాంశం. తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి కేసీఆర్ తో యుద్ధానికి దిగితే ఒక్కడై పోరాడి అందరిని చిత్తుచేసి తిరిగి అధికారం దక్కించుకోవడం వెనుక ఆయన నాలుకే కత్తిలా పనిచేసింది. తెలంగాణ ఉద్యమం విజయవంతంలోను ఆయన నాలుకే కేంద్రరాష్ట్రాల్లో అధికారంలో వున్న వారిని వణికించింది. ఇప్పుడు కూడా అదే ఎపి లోని అధికార పార్టీని కలవరపెడుతున్న ప్రధాన అంశం. ఎపి సిఎం పై వ్యక్తిగతంగా దూషణలతో దాడి మొదలు పెట్టిన కెసిఆర్ ప్రయోగించిన ప్రతిమాట వెనుక రాబోయే ఉపద్రవం ఎటు నుంచి అన్న విశ్లేషణలో బిజీ అయ్యింది బాబు టీం. ఏ రూట్ లో వచ్చినా గులాబీ బాస్ ను చిత్తు చేసే వ్యూహాలకు ఇప్పటినుంచి పదును పెట్టేస్తుంది.
జగన్ తో జతకట్టేస్తారా ... ?
వైసిపి అధినేత జగన్ విజయం కోసం నేరుగా కెసిఆర్ వస్తే ఏమి చేయాలి ? లేదా ఆర్ధికంగా సాయం చేస్తే ఎలా తిప్పికొట్టాలి ? అలా కాకుండా తన నోటికి పని చెప్పి బాబు ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఉంటే ఎలా వ్యవహరించాలి ? పరోక్షంగా వస్తే ? ప్రత్యక్షంగా అయితే ? ఇవన్నీ కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటుకు నోటు కేసు తెరపైకి మళ్ళీ తెస్తే ఏమి చేయాలి ? ఇలా అన్ని కోణాలను టిడిపి పరిశీలిస్తుంది. ఇప్పటికే తెలంగాణ లో వైసిపికి చెందిన కొందరికి భారీ ప్రాజెక్ట్ లను కాంట్రాక్ట్ అప్పగించిందని ఇంకా ఇచ్చుకోండి చూసుకుందాం అనే రీతిలో చంద్రబాబే వ్యాఖ్యలు చేశారంటే టిడిపి శిబిరం ఏ స్థాయిలో అప్రమత్తం అవుతుందో తేటతెల్లం అవుతుంది. మరి ఏమి జరగనుంది ఎవరు ఈ రాజకీయ ఆటలో పై చెయ్యి చాటుతారో కాలమే తేల్చనుంది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- indian national congress
- janasena party
- k.chandrasekharrao
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- tealangana
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కె. చంద్రశేఖర్ రావు
- జనసేన పార్టీ
- తెలంగాణ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- ిrahul gandhi