ఆ..చక్రాన్ని వెనక్కు తిప్పుతారా ...?
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ పక్షాన వుండే మిత్రపక్షాలను ఒక్కరొక్కరుగా టి ఎన్నికల ముందే లాగుతున్నారు చంద్రబాబు. రాహుల్ గాంధీ తో కలిసి టి ఎన్నికలను హీట్ ఎక్కించారు బాబు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పూర్తిగా బిజీ అయిపోయారు. దీనికి అడ్డుకట్ట వేసే చక్రమే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్. తెలంగాణ లో ఎన్నికలు పూర్తి అయిపోయాయి. దాంతో కెసిఆర్ మంచి జోష్ మీద జోరు మీద వున్నారు. కొంత కాలం క్రితం ఫెడరల్ ఫ్రంట్ మొదలు పెట్టారు కెసిఆర్. దీని లక్ష్యం అటు బిజెపి ఇటు కాంగ్రెస్ లేని కేంద్ర ప్రభుత్వం రావాలి.
బిజెపి, కాంగ్రెస్ ముక్త భారత్ ....
దశాబ్దాల పాటు అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్, బిజెపిలు దేశంలో అనేక కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యాయి అన్నది కెసిఆర్ వాదన. ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కాదని దేశ వ్యాప్తంగా వున్న ప్రాంతీయ పార్టీలన్నిటిని కలుపుకుని ఫెడరల్ ఫ్రంట్ కి శ్రీకారం చుట్టారు గులాబీ బాస్. దాంతో ఆ ఫ్రంట్ యాక్టివిటీ మొదలు అయ్యింది. తెలంగాణ ఎన్నికలకు ముందు దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసివచ్చారు కేసీఆర్. ఆయన తరువాత చంద్రబాబు స్కూల్ స్టార్ట్ చేశారు. ఇద్దరు చంద్రులు జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలకం అయిపోయారు.
కేసీఆర్ కున్న స్వేచ్ఛ బాబుకు ఏది ..?
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు స్వేచ్ఛగా జాతీయ రాజకీయాల్లో స్పీడ్ కానున్నారు గులాబీ బాస్. ఇప్పటివరకు జాతీయ రాజకీయాల్లో టాప్ లో వున్న చంద్రబాబు ఇప్పుడు ఎపి రాజకీయాలపై ఎక్కువ సమయం కేటాయించక తప్పదు. కెసిఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకు వీలైనమత తీరిక లభించడంతో చంద్రబాబు కు తెలుగు రాష్ట్రాల్లోనే పట్టు లేదంటు జాతీయ స్థాయిలో బాబు ఇమేజ్ డ్యామేజ్ చేసే పనిలో గులాబీ బాస్ బిజీ కానున్నారు. అదే ఇప్పుడు టిడిపి కి ఆందోళన కలిగిస్తుంది. మరి ఏ చంద్రుడు జాతీయ రాజకీయాల్లో ప్రకాశిస్తారో వేచి చూడాలి.
- Tags
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- left parties
- nara chandrababu naidu
- rahulgandhi
- telangana
- telangana jana samithi
- telangana rashtra samithi
- telugudesamparty
- ts politics
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- రాహుల్ గాంధీ
- వామపక్ష పార్టీలు