Exclusive : గంటాకు క్లాస్ పీకిన చంద్రబాబు
అమరావతి నుంచి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు చంద్రబాబునాయుడు ఉగ్రరూపం దాల్చారు. ఈసారి ఆయన కోపానికి బలైంది.. మంత్రి గంటా శ్రీనివాసరావు. సీఎం స్థానంలో ఉన్న తరవాత తరచూ అసహనానికి గురికాకుండా ఉండడం కూడా కష్టమే. అయితే ఇలాంటి సాధారణ కోపం కాకుండా.. ఏదో అధికారుల్ని మందలించి వదిలేయడం కాకుండా.. సాక్షాత్తూ మంత్రి గంటా శ్రీనివాసరావుకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తున్నది.
అమరావతిలో రెండు రోజుల కిందట విద్యాశాఖపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో ఒకదశలో చంద్రబాబు నాయుడు విపరీతమైన అసహనానికి గురయ్యారుట. మీకు కీలక బాధ్యతలు అప్పగిస్తే.. విద్యారంగాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. శాఖా నిర్వహణ చాలా ఘోరంగా ఉంది ... అంటూ చంద్రబాబునాయుడు కోపగించారుట. మీకు శాఖ మీద పట్టు ఉండడం లేదు... సమస్యలు వచ్చినప్పుడు స్పందన సరిగ్గా లేదు. నిర్వహణ లేదు. ఇలాగైతే ముదు ముందు చాలా కష్టం అంటూ చంద్రబాబు , గంటాను హెచ్చరించినట్లు సమాచారం.
అయితే ఇక్కడ చంద్రబాబు ఆగ్రహం గురించి కూడా తెలిసిన తర్వాత.. పలువురు మరికొన్ని సంగతులను కూడా ప్రచారంలోకి తెస్తున్నారు. గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి నారాయణ ఇద్దరూ వియ్యంకులు అవుతారు. నారాయణ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలకు మేలు చేయడానికే అన్నట్లుగా.. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను గంటా గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పైగా విద్యాసంస్థలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, ఆత్మహత్యలు లాంటి దుర్ఘటనలు సంభవించినా.. ఆయా సందర్భాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు.. అనేక సందర్భాల్లో పార్టీ పరువు తీసింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు విద్యాశాఖ పనీతరు విషయంలో అసంతృప్తితో ఉన్నారని, దానివల్లనే తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలుస్తోంది.