లైఫ్ స్టైల్: ఫ్యాషన్ ప్రపంచంలో మేటి...!
ఎంబ్రాయిడరీ చీరలకు, బ్లౌజ్లకు, డ్రెస్సులకు, లెహంగాలకు చక్కని అందాన్ని తెచ్చిపెడుతుంది. ఎంబ్రాయిడరీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాషన్ ట్రెండ్ కాదు. పూర్వకాలం నుండి ఎంబ్రాయిడరీ ఉంది. పూర్వీకులు చేతులతో చీరల పైన, బ్లౌజ్ పైన, లంగాలపైనా కుట్టుకునే వారు. రకరకాల డిజైన్లతో కూడిన ఎంబ్రాయిడరీ వస్త్రాలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఎంబ్రాయిడరీపై మోజు ఉన్నవాళ్లు ,తమకు నచ్చిన చీర కలర్లో, డ్రెస్ కలర్లో నచ్చిన ఎంబ్రాయిడరీ లేకపోతే బయట వాళ్లకు నచ్చిన కలర్స్ లో, డిజైన్స్‌లో వేయించుకునేవారు.
ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నా కూడా ఎంబ్రాయిడరీ చీరల పైన, డ్రెస్సుల పైన, లెహంగాలపైన . చేయించుకునేవారు. కొంత సమయం పట్టినా కూడా ఎంబ్రాయిడరీ చేయించుకునేవారు. చీరల పైన, డ్రెస్సుల పైన, బ్లౌజ్ లపైన, లెహంగాలపైన ఎంబ్రాయిడరీ చక్కని అందాన్ని తెచ్చిపెడుతుంది.
కొన్నిసార్లు టాప్స్, జాకెట్లు ఇంటి దుస్తులకు ఎంబ్రాయిడరీ కావాలంటే టైలర్ దగ్గర కుట్టించక ముందే వాటిమీద ఎంబ్రాయిడరీ చేయించవలసి ఉంటుంది.
ఎంబ్రాయిడరీ కుట్టించుకోవడం ఖర్చుతో కూడినది. చెమ్కీలూ ,కుందన్లూ , పూసలు జోడించి కూడా కుట్టించుకోవచ్చును. నెమలి డిజైన్స్ , బొమ్మల డిజైన్లు, పువ్వుల డిజైన్లు లేనిదే చాలా రకాల దుస్తులు కళ లేనట్లుగా అనిపిస్తుంటాయి. ఇప్పటికీ అందుకే ఈ రకం పూలను కుట్టే వాళ్లకి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. చీరలు ధరించే వారు చీర సాదాసీదాగా ఉన్న బ్లౌజులు మాత్రం డిజైన్ తో గ్రాండ్ గా ఉండేవిధంగా కుట్టించుకుంటున్నారు.
ఈ బిజీ జీవితంలో వేగం ఎక్కువ. ఏ పనైనా అలా అనుకోగానే అలా అయిపోవాలి. అలాంటిది డ్రెస్ పైన, బ్లౌజ్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ కావాలంటే రోజుల తరబడి ఎదురు చూడనవసరం లేదు ఇప్పుడు వస్తున్న లార్జ్ ఎంబ్రాయిడరీ ఆప్లిక్ ప్యాచ్ లు సులువును తీసుకువస్తున్నాయి. రకరకాల డిజైన్లలో ఎంబ్రాయిడరీ చేసి ఉన్నా ప్యాచులివి టైలర్ దగ్గర కుట్టించుకోవడం మరియు ఖర్చుతో కూడుకున్న పని ఈ ఇబ్బందులేమీ లేకుండా మనకు కావలసిన దుస్తుల మీద ముఖ్యంగా లెహంగాలు, చుడీదార్లు, అనార్కలీలు, కాపుల మీదికి కుట్టు పువ్వుల అందాన్ని చిటికలో తెచ్చేలా లార్జ్ ఎంబ్రాయిడరీ ప్యాచులను రూపొందిస్తున్నారు. డిజైనర్లు వీటిని ఒక వస్త్రం మీద రకరకాల డిజైన్లు ఎంబ్రాయిడరీ చేసి, ఆ డిజైన్ల చుట్టూ కత్తిరించి వేరే దుస్తుల మీద అతికించడానికి వీలుగా తయారు చేస్తారు. మనం వాటిని కొనుక్కుని వర్క్ కావాలనుకున్న దుస్తుల మీద పెట్టి కుట్టిస్తే సరిపోతుంది. ఈ ప్యాచులలో కొన్నింటికి అడుగున జిగురు లాంటి పదార్థం ఉండేలా తయారు చేస్తారు. అలాంటివాటిని డ్రెస్ మీద పెట్టి ఇస్త్రీ చేశామంటే దాని వేడికి ఆ జిగురు కరిగి దుస్తులకు స్టిక్కర్ల అతుక్కుపోతుంది.
ఈ రకం ప్యాచుల్లో పెద్ద పూలగుత్తులు, ఆకులు, తీగలు, నెమలి లాంటి డిజైన్లు ఉన్నవి సాదా దారంతో కుట్టిన వాటితో పాటు చెమ్కీలూ, కుందన్లూ, పూసలు జోడించినవి కూడా వస్తున్నాయి. ఇలా నచ్చిన డ్రస్సుల మీద నచ్చిన డిజైన్లలో ప్యాచ్ ఎంబ్రాయిడరీ కొనుక్కొని అతికించుకోవచ్చు లేక కుట్టించుకోవచ్చు.కానీ ఈ వస్త్ర ప్రపంచంలో ఎంబ్రాయిడరీ తో కూడిన వస్తువులు అనేక రంగులు లభిస్తున్నాయి. డ్రెస్సుల పైన , చీరల పైన రంగురంగుల ఎంబ్రాయిడరీ డిజైన్లతో కూడిన వస్త్రాలు మార్కెట్లో లభిస్తున్నాయి. చాలామంది ఎంబ్రాయిడరీ తో కూడిన చీరలను, డ్రెస్సులను ఇష్టపడుతున్నారు.
వస్త్ర ప్రపంచంలో ఎంబ్రాయిడరీ డిజైన్లతో కూడిన వస్త్రాలు వచ్చినా ఇప్పటికికూడా చీరల పైన, లెహంగాల పైన, బ్లౌజుల పైన చెయించుకుంటున్నారు.
- Tags
- ఎంబ్రాయిడరీ