లైఫ్ స్టైల్ : ఈ నీళ్ళు త్రాగండి... అనారోగ్యాన్ని మరచిపోండి..!
కొబ్బరికాయ హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. ప్రతి పూజ, పవిత్ర కార్యక్రమాల్లోనూ చాలా భాగం కొబ్బరి తోనే ముడిపడి ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయలు అందరూ శుభప్రదంగా భావిస్తారు. మనదేశంలో శుభకార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళ వాళ్లకు రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ, కొబ్బరి నూనె తప్పని సరిగా ఉండి తీరాల్సిందే. వారి ఆరోగ్యము ,సంపద కొబ్బరి పంట మీద ఆధారపడి ఉంటుంది. కేరళ వాళ్ళు ఎక్కువగా కొబ్బరిని అన్నిటిలో ఉపయోగిస్తారు. మనం కూడా కొబ్బరిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి.
పిల్లల నుండి పెద్దవాళ్ల వరకూ తాగడానికి ఇష్టపడే నీరు కొబ్బరి నీళ్లు మాత్రమే. ఈ కొబ్బరి నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి కొబ్బరినీళ్లు ఎంతో మంచిది. ఏ ఋతువులో అయినా తాగదగినవి కొబ్బరినీళ్లు. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగానూ ఉంటాయి కొవ్వులు అసలు ఉండవు. చక్కెర పరిమితంగా ఉండును. కొబ్బరిబొండం నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి లెవల్ కరక్ట్ చేస్తుంది. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ కొబ్బరి బొండం నీళ్లు తాగుతారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండాకాలంలో తప్పనిసరిగా కొబ్బరి బొండం నీళ్ళు తాగాలి. ఈ కాలంలో మన శరీరంలోని వాటర్ లెవల్ తగ్గిపోతుంటుంది. అందుచేత కొబ్బరి నీళ్లను తప్పనిసరిగా త్రాగాలి.
కొబ్బరికాయలో నీరు, కండ ఉంటాయి. నీరు, కండ, గట్టితనంగల నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి ఔషధగుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది.
ఇందులో ఎలెక్ట్రోలైట్స్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, మూత్ర విసర్జన ధారాలంగా జరిగేందుకూ, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, దిగ్భ్రాంతి కలిగినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను వాడవచ్చు. అతిసారం, చీము రక్తం భేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని వాడవచ్చును. హైపర్ ఎసిడిటి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చును. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని ఆపుచేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియాన్ని శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్ధాలను బయటకు గెంటడం వల్ల అంటురోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండిపదార్ధాలు, మాంసకృత్తుల వల పేగులలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృత్తులతో కూడిన ఆహారంగా భావించబడుతోంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువును చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు రాయవచ్చును. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది.
బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి ఎసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, జ్వరం కు మంచి పరిష్కారం అంటున్నారు వైద్యులు.కోబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది . ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంటున్నారు వైద్యులు.పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది . కొబ్బరిచెట్టులో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది . అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు .
జీర్ణకోశ బాధలతో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది, వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరి నీళ్లను లేపనం గావాడాలి . కొన్ని రకాల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి,,, కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది . ఇది మంచి మినరల్ వాటర్ చెప్పవచ్చు.. మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన కొబ్బరినీళ్లను ప్రతిరోజూ తాగండి ఆరోగ్యంగా ఉండండి.....
- Tags
- కొబ్బరికాయ