జూనియర్ ట్రై చేస్తోంటే ఎంగేజ్ టోన్ వస్తోందిట!

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చిత్రమైన పరిస్థితిలో పడ్డారు. జనతా గ్యారేజి చిత్రం విడుదల అయి ఆల్రెడీ టీవీ ఛానెల్ లో కూడా వచ్చేసింది. ఇప్పటిదాకా తన కొత్తచిత్రం ఏదీ మొదలు కాలేదు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే.. ఈ నందమూరి యంగ్ హీరోకు గ్యాప్ వచ్చేసిందనే నెగటివ్ ప్రచారం కూడా షురూ అవుతుంది. అయితే తదుపరి చేయాల్సిన చిత్ర విషయంలో ఎన్టీఆర్ చాలా సీరియస్ గానే ఉన్నారు కానీ.. వెంటనే ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నప్పటికీ.. సరైన కాంబినేషన్ లు కుదరడం లేదని అంతా అంటున్నారు.
సాధారణంగా ఎన్టీఆర్ తమ కథ వినడం కోసం క్యూలో నిల్చుకునే దర్శకులే మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది. అయితే వారంతా ఎన్టీఆర్ పనిచేయాలని తాముగా కోరుకుంటున్న రేంజి దర్శకులు. ఎన్టీఆర్ తాను గా కోరుకుంటున్న దర్శకుల జాబితా వేరే ఉంద. అలాంటి దర్శకులకు ఆయనే ఫోన్లు చేసి పలకరిస్తున్నారట.
కానీ ట్రాజెడీ ఏంటంటే... ఎన్టీఆర్కు ఎంగేజ్ టోన్ వినిపిస్తోంది. అంటే మరేం కాదు, సదరు ఎన్టీఆర్ కోరుకుంటున్న దర్శకులంతా.. ఆల్రెడీ షూటింగుల్లో ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. స్టార్ హోదా ఉన్న దర్శకులంతా ఇప్పుడు ఏదో ఒక హీరోతో చిత్రాలు తీస్తూనే ఉన్నారు. అలాంటి వారు ఎప్పటికి ఖాళీ అయి ఎన్టీఆర్ కోసం అందుబాటులోకి వస్తారో తెలియదు. త్రివిక్రమ్ కూడా జూనియర్ కు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి గానీ.. ఆయన పవన్ తో ప్రారంభించే సినిమా పూర్తయిన తర్వాత గానీ, ఇలాంటి వార్తలను నమ్మలేం. అప్పటిదాకా మరి జూనియర్ ఖాళీగా కూర్చుంటాడా? లేదా, నెక్ట్స్ జెనరేషన్ దర్శకులతో మరోసారి ప్రయోగానికి సిద్ధపడతాడా? అనేది వేచిచూడాలి.