ఈ సీఎం ఏం చేశారో తెలుసా?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కమలదళంలో చేరుతున్నారా? నితీష్ బీజేపీకి దగ్గరవుతున్నారా? నితీష్ చేసిన ఒకే ఒక పని ఈ వదంతులను రేపింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలోని ఒక బుక్ ఫెస్టివల్ కు వెళ్లారు. బుక్ ఫెస్టివల్ లో ఒక పెయింటింగ్ కు రంగులద్దడం ఆశ్చర్యానికి గురి చేసింది.
కమలం పెయింటింగ్ కు రంగులద్దడంతో ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారన్న వార్తలొచ్చాయి. కాని ఆర్ జేడీయూ పార్టీ దీనిని ఖండించింది. నితీష్ ఎప్పుడూ బుక్ ఫెయిర్ కు వెళతారని, ఒక పెయింటింగ్ కు మాత్రమే రంగులద్దారని...అది బీజేపీ గుర్తు అయితే ఆ పార్టీలో చేరినట్లా? అని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు. భారత పతాకంలో ఉన్న రంగులద్దారని నీరజ్ తెలిపారు.
దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసర లేదన్నారు. బీజేపీ కి కూడా దీనిని ఖండించింది. నితీష్ నోట్ల రద్దు అంశంపై కేంద్రప్రభుత్వానికి మద్దతు తెలపారని, తాము బీహార్ లో మద్య నిషేధానికి మద్దతిచ్చామని, అయితే రెండు పార్టీలూ కలిసి పోయినట్లేనా? అని బీజేపీ అధికార ప్రతినిధి షహనాజ్ హుస్సేన్ ప్రశ్నించారు. బీహార్ కూడా టీం ఇండియాలో ఒక భాగేనన్నారు. బీజేపీ గుర్తయిన కమలానికి పెయింటింగ్ వేసినంత మాత్రాన బీజేపీకి దగ్దర అయినట్లు కాదని ఆర్జేడీ కూడా తెలిపింది. మొత్తం మీద సీఎం పెయింటింగ్ కు వేసిన రంగులపై వివాదం రేగింది.
- Tags
- నితీష్ కుమార్