Thu Mar 12 2026 18:52:33 GMT+0530 (India Standard Time)
ఆయిల్, గ్యాస్ కొరతపై లోక్ సభలో గందరగోళం
ఆయిల్, గ్యాస్ కొరతపై లోక్ సభలో గందరగోళం తలెత్తింది

ఆయిల్, గ్యాస్ కొరతపై లోక్ సభలో గందరగోళం తలెత్తింది. ఆయిల్, గ్యాస్ కొరతపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటన చేశారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత వ్యవహారాలను అమెరికా శాసిస్తుందన్నారు. ఇప్పటికే గ్యాస్ కొరతతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. అమెరికా అనుమతి లేకుండా ఆయిల్ ను కొనలేరా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
కొరతలేదని....
అయితే దేశంలో ఆయిల్, గ్యాస్ కొరతలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రతిరోజూ 90 మిలియన్ మెట్రకి్ క్యూబిక్ గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నామని యన తెలిపారు. సభలో అదానీ, ఎప్ స్టీన్ అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించడంతో స్పీకర్ రాహుల్ గాంధీపై సీరియస్ అయ్యారు. గల్ఫ్ కు బదులుగా నార్వే, స్వీడన్ ల నుంచి క్రూడాయిల్ ను దిగుమి చేసుకుంటున్నామని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామని, భారత్ లో ఆయిల్, ఎల్.పి.జి కొరత లేదని ఆయన తెలిపారు.
Next Story

