Sun Jan 12 2025 22:12:04 GMT+0000 (Coordinated Universal Time)
అతిపెద్ద స్కామ్.. గుజరాత్ కేంద్రంగా?
దేశంలో మరో అతిపెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకులకు 22,842 కోట్ల రూపాయలను ఎగవేసిన సంస్థ బండారం బట్టబయలయింది
దేశంలో మరో అతిపెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకులకు 22,842 కోట్ల రూపాయలను ఎగవేసిన సంస్థ బండారం బట్టబయలయింది. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. గుజరాత్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డు లిమిటెడ్ నౌకల తయారీ, మరమ్మత్తులు చేస్తుంది. ఈ కంపెనీకి ప్రత్యేకంగా యార్డులున్నాయి. గుజరాత్, సూరత్ లో ఉన్న యార్డుల నుంచి ఇప్పటి వరకూ ఈ కంపెనీ 165 నౌకలను తయారు చేసింది.
ఈ బ్యాంకులకు....
అయితే ఈ కంపెనీ మొత్తం 28 బ్యాంకులకు టోకరా వేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 7,089 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2,925 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు నుంచి 3,634 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు కు 1,244 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 1,228 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా ఈ రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది.
సీబీఐ కేసు నమోదు....
ఈ కేసులో ఏబీజీ షిప్ యార్డు కంపెనీకి చెందిన రిషి అగర్వాల్, శంతనం ముత్తుస్వామి, అశ్వినికుమార్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాలను బ్యాంకుల నుంచి తీసుకుని ఆ నిదులను మళ్లించడమే కాకుండా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సీబీఐ విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూడనున్నాయి.
Next Story