పవన్ నిజాయితీ అంటే ఇష్టం అంటున్న మెగా హీరో?
మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా తన ఆఫీస్ లోనే లాక్ డౌన్ లో ఉన్నాడు. బాక్సర్ గా నటించబోయే సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుంటున్న వరుణ్ [more]
మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా తన ఆఫీస్ లోనే లాక్ డౌన్ లో ఉన్నాడు. బాక్సర్ గా నటించబోయే సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుంటున్న వరుణ్ [more]
- హరీష్ శంకర్ అంటే క్రష్
- బాబాయ్ పవన్ కళ్యాణ్ లో ఆయన నిజాయితీ నచ్చుతుంది
- పెదనాన్న చిరు లో అందరిని ప్రోత్సహించే గుణం ఇష్టం
- గుర్రపు స్వారీ నేర్చుకునే టైం లో గుర్రం పై నుండి పడిపోయా
మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా తన ఆఫీస్ లోనే లాక్ డౌన్ లో ఉన్నాడు. బాక్సర్ గా నటించబోయే సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుంటున్న వరుణ్ తేజ్ కరోనా తో తన ఆఫీస్ లోనే తన ట్రైనర్ తో పాటుగా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. తాజాగా అభిమానులతో ఫేస్ బుక్ లైవ్ చాట్ కొచ్చిన వరుణ్ తేజ్ చాలా విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అందులో భాగంగా తనకి హరీష్ శంకర్ అంటే క్రష్ అని.. గద్దలకొండ గణేష్ చేసినప్పటినుండి హరీష్ శంకర్ అంటే క్రష్ అంటున్నాడు వరుణ్ తేజ్. అలాగే చరణ్ తో పాటుగా గుర్రపు స్వారీ నేర్చుకునే టైం లో గుర్రం పై నుండి పడిపోవడంతో.. అప్పటినుండి గుర్రాల వైపు కూడా వెళ్లలేదట వరుణ్ తేజ్.
ఇక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లో ఆయన నిజాయితీ నచ్చుతుంది అని… పెదనాన్న చిరు లో అందరిని ప్రోత్సహించే గుణం ఇష్టమని, ఇక రామ్ చరణ్ తనకి భాయ్ అంటున్నాడు వరుణ్ తేజ్. ఇక అల్లు అర్జున్ లో, రామ్ చరణ్ లో నచ్చే గుణాలు వాళ్ళు కష్టపడే మనస్తత్వం అంటున్నాడు వరుణ్ తేజ్. ఇక లాక్ డౌన్ సమయంలో గద్దల కొండ గణేష్ చిత్రాన్ని పదకొండు సార్లు చూసా అని… గద్దలకొండ గణేష్ పాత్ర అంటే తనకి చాలా ఇష్టమని చెబుతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్.
- Tags
- varun tej