డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విషయంలో ఎన్సీబీ అధికారులు ప్రస్తుతం సైలెంట్ గా కనబడడంతో ఆ కేసు నీరుగారిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ముంబై లోని ఓ [more]
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విషయంలో ఎన్సీబీ అధికారులు ప్రస్తుతం సైలెంట్ గా కనబడడంతో ఆ కేసు నీరుగారిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ముంబై లోని ఓ [more]
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విషయంలో ఎన్సీబీ అధికారులు ప్రస్తుతం సైలెంట్ గా కనబడడంతో ఆ కేసు నీరుగారిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ముంబై లోని ఓ హోటల్ లో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్ అవడం సంచలనంగా మరింది. సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులనే కొన్నాళ్ళు జైలు పాలయిన సంగతి విదితమే. ప్రస్తుతం బెయిల్ పై బయటికి వచ్చిన రియా చక్రవర్తి ఆమె తమ్ముడు.. బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ కొంప ముంచిన సంగతి కూడా తెలిసిందే. రియా బయట పెట్టిన పేర్లలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ద కపూర్ వంటి హీరోయిన్స్ మాత్రమే కాకుండా రియా దోస్త్ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ కూడా డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణను ఎదుర్కొంది. అయితే తాజాగా మళ్ళీ కొత్త సంవత్సరం లో ముంబైలో డ్రగ్స్ అమ్ముతూ ఓ టాలీవుడ్ నటి ఎన్సీబీ అధికారులకి దొరకడం సంచలనంగా మారింది.
ముంబయిలోని మీరా రోడ్డులోని ఓ హోటల్‌పై దాడులు నిర్వహించిన ఎన్సీబీ అధికారులకి అక్కడ పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ డ్రగ్స్ ని పట్టుకున్న క్రమంలో ఓ టాలీవుడ్ నటి అక్కడే ఉన్నట్లుగా, డ్రగ్స్ అమ్ముతూ కనబడడంతో ఆమెని అరెస్ట్ చేసినట్లుగా మీడియాకి తెలిపింది ఎన్సీబీ బృందం. టాలీవుడ్ నటి అని చెబుతున్న హీరోయిన్ ని అలాగే చాంద్ అనే వ్యక్తిని కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఆ హోటల్ లో పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 8 లక్షలు పైమాటే అని, నూతన సంవత్సర వేడుకల్లో వాటిని వాడడానికి ముంబైకి తెచ్చినట్టుగా ఎన్సీబీ అధికారుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన ఆ టాలీవుడ్ నటి ఎవరూ అంటూ ఇప్పుడు మీడియా కిందామీద పడుతుంది.