కరోనా తో జస్ట్ నీరపడ్డా అంతే..!
సినిమా అవకాశాలతో పని లేని రకుల్ ప్రీత్ సోషల్ మీడియా లో మాత్రం బిజీగానే ఉంటుంది. రకుల్ గ్లామర్ షో కానివ్వండి, రకుల్ వర్కౌట్స్ కానివ్వండి ఏదైనా [more]
సినిమా అవకాశాలతో పని లేని రకుల్ ప్రీత్ సోషల్ మీడియా లో మాత్రం బిజీగానే ఉంటుంది. రకుల్ గ్లామర్ షో కానివ్వండి, రకుల్ వర్కౌట్స్ కానివ్వండి ఏదైనా [more]
సినిమా అవకాశాలతో పని లేని రకుల్ ప్రీత్ సోషల్ మీడియా లో మాత్రం బిజీగానే ఉంటుంది. రకుల్ గ్లామర్ షో కానివ్వండి, రకుల్ వర్కౌట్స్ కానివ్వండి ఏదైనా సోషల్ మీడియాలో రకుల్ ఫోటో పడిపోతుంది. గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ రకుల్ అనేలా ఉంటుంది రకుల్ ప్రీత్ అందాల ఆరబోత. ఎప్పుడూ వర్కౌట్స్ తోనే గడిపేసే రకుల్ కి కరోనా రావడం తర్వాత తగ్గడం కూడా జరిగింది. రకుల్ ప్రీత్ యోగాసనాలకు, రకుల్ వర్కౌట్స్ చూసాక కరోనా పారిపోతుంది అన్నట్టుగానే రకుల్ కరోనా త్వరగానే తగ్గిపోయింది. కరోనా తగ్గాక రకుల్ ముంబై లోని ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయింది. అయితే కరోనా వచ్చినప్పుడు తనకు కాస్త నీరసం అనిపించింది అని తన క్వారంటైన్ విషయాలను పంచుకుంది.
వరస సినిమా షూటింగ్స్ వలన ఆ నీరసం వస్తుందేమో అనుకుందట. అందులోను మూడు రోజులకొకసారి చిత్ర బృందానికి కరోనా టెస్ట్ లు చేస్తారు కాబట్టి కరోనా వచ్చింది అని అనిపించలేదట. కానీ బాగా నీరసంగా అనిపించడంతో ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రాగా.. చిత్ర బృందానికి ఇంఫామ్ చేసి హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయా అంటుంది రకుల్. అంతా మంచే జరుగుంతుంది హెల్డిగానే ఉన్నా అని నాకు నేను చెప్పుకుంటూ వర్కౌట్స్ చెయ్యడం, హెల్దీ ఫుడ్ తినడం వంటివి చేసి.. మెడిసిన్ తక్కువ వాడాను అని చెబుతుంది రకుల్