వర్కౌట్స్ తో పబ్లిసిటీ చేసుకుంటుంది
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దేశం మొత్తం భారీగా ఉండడం… తాజాగా జనత కర్ఫ్యూ ని ప్రజలంతా విజయ వంతం చెయ్యడం, మార్చ్ 31 వరకు దేశంలోని [more]
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దేశం మొత్తం భారీగా ఉండడం… తాజాగా జనత కర్ఫ్యూ ని ప్రజలంతా విజయ వంతం చెయ్యడం, మార్చ్ 31 వరకు దేశంలోని [more]
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దేశం మొత్తం భారీగా ఉండడం… తాజాగా జనత కర్ఫ్యూ ని ప్రజలంతా విజయ వంతం చెయ్యడం, మార్చ్ 31 వరకు దేశంలోని రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ప్రకటిస్తూ సీరియస్ నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్ని.. ఆగిపోయి అందరూ ఇళ్లకే పరిమితమైనారు. జనతా కర్ఫ్యూ రోజున సినీ తారలంతా.. కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్స్ కి, పరిశుద్ధ కార్మికులకు క్లాప్స్ కొడుతూ విష్ చేసి ఆ వీడియోస్ షేర్ చేసారు.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి.. ఖాళీ సమయాన్ని వర్కౌట్స్ తో లాగించేస్తుంది. రకుల్ ప్రీత్ తన వర్కౌట్ వీడియోస్ ని షేర్ చేస్తూ కరొనతో భయపడవద్దు…ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఉండి… వారితో మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకోండి, ఇప్పటివరకు చేయని పనులు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇంట్లోనే కూర్చుని చక్కగా చేసుకుని.. ఇళ్ల నుండి బయటికి రావొద్దు అంటూ సలహాలు ఇస్తుంది.