అనుమతులు ఓకె… కానీ వీళ్ళు రెడీ కావడం లేదు!!
కరోనా లాక్ డౌన్ ముగుస్తుండడంతో.. సినిమా ప్రముఖులు, పెద్దలు షూటింగ్స్ అనుమతుల కోసం కెసిఆర్ ని, ఏపీ సీఎం జగన్ ని కలవడం షూటింగ్ కి అనుమతులు [more]
కరోనా లాక్ డౌన్ ముగుస్తుండడంతో.. సినిమా ప్రముఖులు, పెద్దలు షూటింగ్స్ అనుమతుల కోసం కెసిఆర్ ని, ఏపీ సీఎం జగన్ ని కలవడం షూటింగ్ కి అనుమతులు [more]
కరోనా లాక్ డౌన్ ముగుస్తుండడంతో.. సినిమా ప్రముఖులు, పెద్దలు షూటింగ్స్ అనుమతుల కోసం కెసిఆర్ ని, ఏపీ సీఎం జగన్ ని కలవడం షూటింగ్ కి అనుమతులు తీసుకోవడం కోసం వాళ్ళు అటు ఇటు తిరగడం చూసాం. నిర్మాతలు నష్టపోకుండా సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టడానికి సీనియర్ హీరోలు, దర్శకులు నిర్మాతలు కూడా ఈ భేటీల్లో పాల్గొని ఎట్టకేలకు అనుమతులు సంపాదించారు. అయితే వీళ్ళు అనుమతుల కోసం చచ్చి చెడి తిరిగి అనుమతులు తెస్తే.. ఇప్పుడు హీరోలు కొంతమంది షూటింగ్ కి రెడీ కావడం లేదు. పెద్ద సినిమా హీరోలైతే ఇప్పుడే ఎందుకు.. కొన్ని రోజులాగండీ అంటున్నారట.
పరిమిత సంఖ్యలో నటులతో పాటుగా.. టెక్నీకల్ సిబ్బందితో షూటింగ్ చెయ్యడం, సెట్ మొత్తం శానిటైజ్ చెయ్యడం ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి పెరిగిపోవడంతో… హీరోలంతా ముందు జాగ్రత్తగా షూటింగ్ కి అప్పుడే హాజరు కాబోమని చెబుతున్నారట, ఇక్కడేమో దర్శకనిర్మతలు షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలెడమా అని ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి అయితే డూప్స్ తో ట్రయిల్ షూట్ కి రంగం సిద్ధం చేసాడనే టాక్ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువ ఉండడం.. ప్రస్తుతం షూటింగ్స్ కోసం హైదరాబాద్ లోనే సెట్స్ వేసుకుని చిత్రీకరణ జరపాలని నిశ్చయంతో ఉన్న దర్శకులకు ఈ విధంగా హీరోలు ఝలక్ ఇస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ కి అనుమతులిచ్చినా.. ఈ టైం లో కరోనా భీబత్సంగా పెరిగిపోతుంది అని.. ఎంతగా జాగ్రత్తలు పాటించిన కరోనా ఉదృతి టైం లో షూటింగ్ చెయ్యడం అంత మంచిది కాదని హీరోలు భావిస్తున్నారట.