పవన్ కి సాయి పల్లవి – రానా కి ఐశ్వర్య రేజేష్?
పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. మరో హీరోగా రానా ని ఎంపిక చేసారు మరి పవన్ కళ్యాణ్ – రానా నువ్వా [more]
పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. మరో హీరోగా రానా ని ఎంపిక చేసారు మరి పవన్ కళ్యాణ్ – రానా నువ్వా [more]
పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. మరో హీరోగా రానా ని ఎంపిక చేసారు మరి పవన్ కళ్యాణ్ – రానా నువ్వా – నేనా అని పోటీ పడే ఈ సినిమాలో వీరి భార్యలుగా కనిపించబోయే హీరోయిన్స్ విషయంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.. పవన్ కళ్యాణ్ మలయాళ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు అనగానే ఆ సినిమాలో ఏముందో అనే క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో మొదలైంది. దానితో అందరూ అయ్యప్పన్ కోషియమ్ సినిమాని ఓటిటిలో లో వీక్షించేసారు. అయినా తెలుగు నేటివికి దగ్గరగా, త్రివిక్రమ్ ఏమైనా స్క్రిప్ట్ లో చేంజెస్ చేస్తాడేమో అనే క్యూరియాసిటిలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు.
ఇక మాతృక అయ్యప్పన్ కోషియమ్ లో హీరోలిద్దరికీ పెళ్ళై భార్యలు ఉంటారు. అందులో హీరోయిన్స్ కి స్క్రీన్ స్పేస్ తక్కువైనా పవన్ కేరెక్టర్ భార్య పాత్రకి కూసింత నిడివి ఎక్కువ ఉంటుంది. ఆ పాత్ర డీ గ్లామర్ రోల్ తో కూడుకున్నది. అలాగే రానా కేరెక్టర్ వైఫ్ పాత్ర కూడా కీలక పాత్రే కావడంతో ఆ పాత్రల్లో కనిపించబోయే హీరోయిన్స్ ఎవరైతే బావుంటుంది అంటూ పవన్ ఫాన్స్ కూడా ఈ టాపిక్ మీదే సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నాయి. అయితే తాజాగా రానా కేరెక్టర్ కి ఐశ్వర్య రాజేష్ భార్య పాత్ర పోషిస్తుంది అని.. పవన్ భార్య గా సాయి పల్లవి కనిపించే ఛాన్స్ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. సాయి పల్లవికి ఇలాంటి కేరెక్టర్స్ కొట్టిన పిండే. అయితే స్క్రీన్ స్పేస్ కోసం ఆలోచిస్తే ఒప్పుకోవడం కష్టం.