పాలిటిక్స్ మనకొద్దు అంటున్న పవన్
పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు, సినిమాలు రెండు కళ్ళు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా గా ఉన్న పవన్ సినిమాల కథల విషయంలో చాలా [more]
పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు, సినిమాలు రెండు కళ్ళు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా గా ఉన్న పవన్ సినిమాల కథల విషయంలో చాలా [more]
పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు, సినిమాలు రెండు కళ్ళు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా గా ఉన్న పవన్ సినిమాల కథల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నాడట. ఎందుకంటే ఆయన సినిమాలకు పాలిటిక్స్ కి లింక్ లేకుండా ఉన్న కథలనే ఇంతవరకు ఒప్పుకుంటూ వస్తున్నాడు. అంటే వకీల్ సాబ్ దగ్గర నుండి, క్రిష్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ తో చెయ్యబోయే సినిమా, అలాగే అయ్యప్పమ్ కోషియమ్ ఇలా వరసగా కమర్షిల్ ఎంటెర్టైనెర్స్ నే పవన్ కోరుకుంటున్నాడు కానీ.. తన సినిమాల్లో పొలిటికల్ టాపిక్ కానీ, అలాగే డైలాగ్స్ కానీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.పాలిటిక్స్ కి సినిమాకి సంబంధం ఉండకూడదని, సినిమాలు అడ్డుపెట్టుకుని పాలిటిక్స్ లో గెలవకూడదని పవన్ సిద్ధాంతమేమో కానీ.. పవన్ సినిమాల్లో మాత్రం పొలిటికల్ డైలాగ్స్ మాత్రం ఉండవట.
ఈమధ్యన దర్శకుడు దేవా కట్టా పాలిటిక్స్ కి సంబంధం ఉన్న కథతో పవన్ దగ్గరకి వెళితే.. ఆ కథ నచ్చిన పవన్ కి ఆ కథలో కి లింక్ అయ్యి ఉన్న పొలిటికల్ బ్యాగ్డ్రాప్ నచ్చకే తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఆ సినిమా చెయ్యమని పవన్ దేవా కట్టాని సాయి తేజ్ దగ్గరకి పంపడం.. మెగా మేనల్లుడు దేవా కట్టా సినిమాని ఓకె చెయ్యడం జరిగిపోయింది. మరి పవన్ కళ్యాణ్ పర్టిక్యులర్ గా సినిమా కథల విషయంలో ఆచి తూచి స్టెప్ తీసుకుంటున్నాడు. తాను చేసే సినిమాలు పక్కా ఎంటెర్టైమెంట్ తో కూడిన కథలుగా ఉండాలని పవన్ పట్టుబడుతూ మంచి మంచి కథలని ఒప్పుకుంటున్నాడట పవన్.