నారప్ప ఓటిటిలో?
వెంకటేష్ మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దృశ్యం రీమేక్ హక్కులు కొన్న 45 డేస్ లోనే వెంకీ [more]
వెంకటేష్ మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దృశ్యం రీమేక్ హక్కులు కొన్న 45 డేస్ లోనే వెంకీ [more]
వెంకటేష్ మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దృశ్యం రీమేక్ హక్కులు కొన్న 45 డేస్ లోనే వెంకీ దృశ్యం 2 రీమేక్ కంప్లీట్ చేసి అందరికి షాకిచ్చారు. అయితే ప్రస్తుకితం కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ క్లోజ్ అవడంతో వెంకటేష్ దృశ్యం 2 ఓటిటిలో రిలీజ్ చెయ్యబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. వేంటనే దృశ్యం 2 రీమేక్ నిర్మాత సురేష్ బాబు లైన్ లో కొచ్చి దృశ్యం 2 థియేటర్స్ ఓపెన్ అయ్యాక థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాం కానీ.. ఓటిటిలో కాదు. ముందు థియేటర్స్ తర్వాత ఓటిటి అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు వెంకటేష్ మరో రీమేక్ నారప్ప సినిమాని ఓటిటికి అమ్మెయ్యబోతున్నారనే టాక్ మొదలైంది.
తమిళ అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా రీమేక్ చేసిన వెంకటేష్.. ఆ సినిమా షూటింగ్ కూడా ముగించేసి రిలీజ్ కి సిద్ధం చేసేసారు. మే 14 నారప్ప రిలీజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా భయంకర పరిస్థితుల్లో నారప్ప విడుదల మే 14 న సాధ్యమయ్యేలా కనిపించకపోయేసరికి.. నారప్ప ని ఓటిటి సంస్థలు కొనెయ్యడానికి రెడీ అయ్యాయి. ప్రస్తుతం నారప్ప ని కొనే విషయంలో ఓటిటి సంస్థలు ముందుకొచ్చినా నిర్మాత సురేష్ బాబు మాత్రం నారప్పని ఓటిటికి అమ్ముతామని కానీ అమ్మమని కానీ చెప్పకుండా హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది.
- Tags
- Narappa OTT