ఆ మ్యూజిక్ డైరెక్టర్ విడాకులు? కొత్త ప్రేమ?
తెలుగులో యంగ్ హీరోస్ కి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే గోపి సుందర్ నాగ చైతన్య మజిలీ సినిమా అప్పుడు మ్యూజిక్ విషయంలో దర్శకుడిని కాస్త ఇబంది పెట్టాడనే [more]
తెలుగులో యంగ్ హీరోస్ కి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే గోపి సుందర్ నాగ చైతన్య మజిలీ సినిమా అప్పుడు మ్యూజిక్ విషయంలో దర్శకుడిని కాస్త ఇబంది పెట్టాడనే [more]
తెలుగులో యంగ్ హీరోస్ కి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే గోపి సుందర్ నాగ చైతన్య మజిలీ సినిమా అప్పుడు మ్యూజిక్ విషయంలో దర్శకుడిని కాస్త ఇబంది పెట్టాడనే టాక్ ఉంది. అయితే గోపి సుందర్ మలయాళం టాప్ మ్యూజిక్ డైరెక్టర్. యంగ్ అండ్ ఎనర్జీ మ్యూజిక్ తో దూసుకుపోతున్న గోపి సుందర్ పెర్సనల్ గా కాస్త ప్రోబ్లెంస్ లో ఉన్నట్లుగా.. భార్య తో విభేదాలతో విడాకులకు అప్లై చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. తన భార్య ప్రియా తో గోపి సుందర్ కి గొడవలు జరగడంతో ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. గోపి సుందర్ విడాకులకు అప్లై చేసాడని..దానికి అయన భార్య ప్రియా కూడా ఒప్పుకుంది అనే ప్రచారం జరుగుతుంది.
మరో పక్క భార్య తో విడాకులు, మరో యంగ్ సింగర్ తో గోపి సుందర్ ప్రేమలో ఉన్నట్లుగా మీడియా టాక్. తాజాగా గోపి సుందర్ తన విడాకులు, ప్రేమ వ్యవహారాలపై పెదవి విప్పాడు. విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది .. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను…… అని చెప్పుకొచ్చాడు. అంటే బయట ప్రచారం జరిగినట్టుగా గోపిసుందర్ భార్యకి విడాకులివ్వడమే కాదు.. మరో యువ గాయనితో లవ్ లో ఉన్నాడనేది నిజమే మరి.
- Tags
- Gopi Sundar