తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి సూపర్‌స్టార్ మహేష్‌బాబు కోటి రూపాయల విరాళం
భారీ వర్షాల వలన కలిగిన నష్టానికి చేయూతగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి సూపర్‌స్టార్ మహేష్‌బాబు కోటి రూపాయల విరాళం గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా [more]
భారీ వర్షాల వలన కలిగిన నష్టానికి చేయూతగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి సూపర్‌స్టార్ మహేష్‌బాబు కోటి రూపాయల విరాళం గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా [more]
భారీ వర్షాల వలన కలిగిన నష్టానికి చేయూతగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి సూపర్‌స్టార్ మహేష్‌బాబు కోటి రూపాయల విరాళం
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోవడానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు, “తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ విపత్తు వల్ల సంభవించిన వినాశనం మనం ఊహించనిది. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తమ వంతు కృషి చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి అభినందనలు. నా వంతు సాయంగా తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు అండగా వీలైనంత సహాయం అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని అన్నారు.