బ్యాగ్రౌండ్ లేకుండా హీరోయిన్ అంటే చాలా కష్టపడాలి!!
బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడ్డుపెట్టి అక్కడ నిలబడాలి అంటే చాలా కష్టమైన పనే. ఈమాట ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానంతరం వినిపిస్తున్న మాట. బాలీవుడ్ [more]
బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడ్డుపెట్టి అక్కడ నిలబడాలి అంటే చాలా కష్టమైన పనే. ఈమాట ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానంతరం వినిపిస్తున్న మాట. బాలీవుడ్ [more]
బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడ్డుపెట్టి అక్కడ నిలబడాలి అంటే చాలా కష్టమైన పనే. ఈమాట ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానంతరం వినిపిస్తున్న మాట. బాలీవుడ్ లోనే కాదు… ఎక్కడైనా సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళకి కాస్త గౌరవం, అవకాశాలు దక్కుతాయి. అదే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరగాలి, అలా కాదంటే పిలిచిన వాళ్ళ పక్క లోకి వెళ్లాల్సి ఉంటుంది అనేది నేటి తరం హీరోయిన్స్ మాట. తెలుగులో రెండు సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించలేక బాలీవుడ్ లో సెటిల్ అయిన కియారా అద్వానీ ఇప్పుడు అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
రెండు మూడు సినిమాల్తోనే టాప్ ప్లేస్ కొట్టేసిన కియారా హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన కొత్తల్లో చాలా కష్టపడిందట. హీరోయిన్ గా ఎదగడం కోసం కియారా అద్వానీ పడ్డ కష్టాలను ఏకరువు పెడుతుంది. స్వశక్తితో అవకాశాలు దక్కించుకున్నానన్న కియారా అద్వానీ అవకాశాల కోసం కెరీర్ తొలినాళ్లలో అనేక సినిమా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసిందట. ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్నాను అని కియారా చెబుతుంది. మరి బాలీవడో లో నట వారసత్వంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ చాలామంది పెద్దగా క్రేజ్ లేకుండానే మిగిలిపోయినా.. ఇలాంటి కొత్త హీరోయిన్స్ స్వశక్తితో పైకివచ్చి.. టాప్ లెవెల్ కి చేరుకున్నారనేది కియారని చూస్తే తెలుస్తుంది.
- Tags
- Kiara advani