పుష్ప లో దిశా పథాని ?
సుకుమార్ – బన్నీ కలయికలో పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు కానీ… అప్పుడే సినిమాపై అంచనాలు పెరిగేలా భారీ న్యూస్ లు [more]
సుకుమార్ – బన్నీ కలయికలో పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు కానీ… అప్పుడే సినిమాపై అంచనాలు పెరిగేలా భారీ న్యూస్ లు [more]
సుకుమార్ – బన్నీ కలయికలో పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు కానీ… అప్పుడే సినిమాపై అంచనాలు పెరిగేలా భారీ న్యూస్ లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా బన్నీతో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పథాని ఐటెం స్టప్స్ వెయ్యబోతుంది అని.. పుష్ప లో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో ఓ లారీ ఛేంజింగ్ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలవబోతుంది అని ప్రచారం జరుగుతుంది. ఆ సీన్ కూడా అడవి నేపథ్యంలోనే ఉండబోతుందట.
అయితే ఆ భారీ యాక్షన్ సన్నివేశం కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ని సుకుమర్ దింపాలని చూసినప్పటికీ.. కరోనా అడ్డం పడడంతో.. బాలీవుడ్ స్టెంట్ మాస్టర్స్ తోనే పని కానిచ్చేస్తున్నారట. అయితే ఈ ఫైట్ సీన్ పుష్ప సినిమాలో 6 నిమిషాల పాటు వుంటుందట. ఈ 6 నిమిషాల ఫైట్ సీన్ కి గాను 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ రేంజ్ ఖర్చు ఆ సీన్ కి పెడుతున్నారంటే… సినిమాలో ఈ యాక్షన్ సీన్ ను ఏ రేంజ్ లో చిత్రీకరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు. ఇక సాంగ్స్ విషయంలోనూ సుకుమార్ ప్రత్యేకమైన సెట్స్ వెయ్యాలని… అవుట్ డోర్ షూటింగ్ ఎంతవరకు తగ్గించాలో అంతగా కుదించి.. సెట్స్ లోనే షూటింగ్ పనికనిచ్చెయ్యాలని ఆలోచిస్తున్నాడట.