దివాళీ కి దుమ్మురేపడం ఖాయం!!
దసరా సెలవలన్నీ సినిమా వాళ్ళకి బూడిదలో పోసిన పన్నిరు అయ్యాయి. కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉండడంతో థియేటర్స్ తెరిచినా హీరోలు సాహసం చేయలేక సినిమాలు విడుదల [more]
దసరా సెలవలన్నీ సినిమా వాళ్ళకి బూడిదలో పోసిన పన్నిరు అయ్యాయి. కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉండడంతో థియేటర్స్ తెరిచినా హీరోలు సాహసం చేయలేక సినిమాలు విడుదల [more]
దసరా సెలవలన్నీ సినిమా వాళ్ళకి బూడిదలో పోసిన పన్నిరు అయ్యాయి. కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉండడంతో థియేటర్స్ తెరిచినా హీరోలు సాహసం చేయలేక సినిమాలు విడుదల చెయ్యలేదు. దానితో దసరా ఉసూరుమంటూ వెళ్ళింది. థియేటర్స్ లేకపోయినా కనీసం ఓటిటి లో అయినా మంచి సినిమాలు విడుదలవుతాయి అనుకుంటే.. అదీ లేదు. ఈ దసరాకు జస్ట్ చిన్న సినిమా కలర్ ఫోటో తో సరిపెట్టేసారు. పండగ సందడి ఎక్కడా కనబడలేదు. దసరా పొతే పోయింది.. అన్ని భాషల్లోనూ దివాళికి దుమ్మురేపడం ఖాయం అంటున్నారు.
అంటే థియేటర్స్ దగ్గర బాక్సాఫీసు కళకళలాడుతుందో లేదో క్లారిటీలేదు కానీ.. ఓటైటిలలో మాత్రం చిన్న పెద్ద సినిమాల క్యూ మాములుగా లేదు. తమిళంలో దివాళికి చాలా సినిమాలు విడుదలవుతాయి. కానీ ఇప్పుడు అన్ని భషాల సినిమాలు ఓటిటి లో తడాఖా చూపించడానికి రెడీ అవుతున్నాయి. అందులో ముందుగా నవంబర్ 4 న కీర్తి సురేష్ మిస్ ఇండియా నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుంటే.. సోలో బ్రతుకే సో బెటరు కూడా దివాళీ రోజున జీ 5 అంటున్నారు. ఇక నవంబర్ 9 న బాలీవుడ్ లక్ష్మి బాంబ్ హాట్ స్టార్ లో పేలబోతుంది. కృష్ణ హిస్ లీల ఫేమ్ సిద్దు జొన్నలగట్ట మా వింత గాథ వినుమా కూడా ఆహా లో విడుదలకాబోతుంది.
ఇక తెలుగు తమిళ ప్రేక్షకులకు హీరో సూర్య ఆకాశమే నీ హద్దురా అంటూ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 12 న విడుదల కాబోతుంది. మరి విశాల్ చక్ర కూడా దివాళీ అంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ చెయ్యాల్సి ఉంది. మరి దివాళికి పటాసులు మాత్రమే పేలవు.. ఈసారి సినిమాల పేలుడు భారీగానే ఉండబోతుంది. ఇక దివాళీ టైం కి థియేటర్స్ గనక 100 శాతం ఆక్యుపెన్సీ అంటే.. థియేటర్స్ దగ్గర కళకళలు తప్పవు.