ఏంటి భీష్మా విషయం
నితిన్ – రష్మిక భీష్మా సందడి ముగిసిపోయింది. ఎందుకంటే భీష్మా మరింత కలెక్షన్స్ రాబట్టేదే కానీ.. కరోనా వైరస్ వలన ప్రస్తుతం థియేటర్స్ బంద్ వలన భీష్మా [more]
నితిన్ – రష్మిక భీష్మా సందడి ముగిసిపోయింది. ఎందుకంటే భీష్మా మరింత కలెక్షన్స్ రాబట్టేదే కానీ.. కరోనా వైరస్ వలన ప్రస్తుతం థియేటర్స్ బంద్ వలన భీష్మా [more]
నితిన్ – రష్మిక భీష్మా సందడి ముగిసిపోయింది. ఎందుకంటే భీష్మా మరింత కలెక్షన్స్ రాబట్టేదే కానీ.. కరోనా వైరస్ వలన ప్రస్తుతం థియేటర్స్ బంద్ వలన భీష్మా లాంగ్ రన్ అవకముందే ఆగిపోయింది. ఇక భీష్మా ముచ్చట్లు ముగిసాక.. మల్లి భీష్మా సినిమా చిరు చూడడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు వెంకీ కుడుములు తో కలిసి చిరు భీష్మా ని వీక్షించి.. వెంకీ కుడుముల ని.. అప్రిషెట్ చేసిన విషయం వెంకీ కుడుముల ఓ ఫోటో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చిరు గారితో సినిమా చూడడమా అదృష్టంన్నాడు. అయితే వెంకీ కుడుముల ఎప్పుడో అడిగితే.. చిరుకి ఇప్పటికి భీష్మా చూసే అవకాశం వచ్చింది. ఎందుకంటే కరోనాతో ఆచార్య షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.
అయితే భీష్మా ని చిరు తో ప్రత్యేకించి చూపించడానికి కారణం వెంకీ కుడుములు మెగా హీరోస్ మీద కన్నేశాడనే టాక్ మొదలయ్యింది. గతంలోనే అంటే బీష్మ హిట్ అయ్యాక రామ్ చరణ్ కి వెంకీ కథ వినిపించాడని అన్నారు. స్టోరీ లైన్ నచ్చి.. చరణ్ పూర్తి స్క్రిప్ట్ తో వెంకీని రమ్మన్నాడనే టాక్ నడిచింది. కాని అది అప్పట్లో రూమర్స్ లిస్ట్ లోకెళ్లింది. కానీ తాజాగా వెంకీ మూడో సినిమా టార్గెట్ మెగా హీరోలతోనే అని.. అందుకే వెంకీ కుడుముల చిరు తో మీట్ అయ్యి సినిమా చూపించి.. అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ తో కానీ తన మూడో సినిమా అవకాశం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసాడని అంటున్నారు. అందుకే చిరుతో వెంకీ పిక్ చూడగానే.. వెంకీ నువ్వు తెలివైనోడువయ్యా.. చిరు సినిమా చూసి సూపర్ అంటూ నీ క్రియేటివిటీని మెచ్చుకుని ఏదో ఓ హీరోని సెట్ చేసినా చేస్తాడు అందుకే ఇలా అబ్బా నీ తెలివితేలు సూపర్ వెంకీ అంటున్నారు