చైతు – సామ్ బ్యానర్ లో ఫస్ట్ సినిమా అదేనా?
సమంత – నాగ చైతన్య లు కలిసి ఓ కొత్త నిర్మాణ సంస్థని పెడుతున్నారని టాక్ ఉంది. అందులో నిజం కూడా ఉందని.. త్వరలోనే వాళ్ళ బ్యానర్ [more]
సమంత – నాగ చైతన్య లు కలిసి ఓ కొత్త నిర్మాణ సంస్థని పెడుతున్నారని టాక్ ఉంది. అందులో నిజం కూడా ఉందని.. త్వరలోనే వాళ్ళ బ్యానర్ [more]
సమంత – నాగ చైతన్య లు కలిసి ఓ కొత్త నిర్మాణ సంస్థని పెడుతున్నారని టాక్ ఉంది. అందులో నిజం కూడా ఉందని.. త్వరలోనే వాళ్ళ బ్యానర్ లో ఓ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. అయితే మొన్నామధ్యన సమంత కన్నడ సూపర్ హిట్ ఫిలిం దియా రీమేక్ ని సొంత బ్యానర్ లో చేస్తుంది అని.. కాదు నందిని రెడ్డి తో ఓ సినిమాని తానే హీరోయిన్ గా ఆ సినిమాని నిర్మించబోతోంది అని అన్నారు. అయితే దియా సంగతేమో కానీ.. నందిని రెడ్డి మాత్రం సమంత తో సినిమా లేదనేసింది.
అయితే తాజాగా చైతు – సామ్ నిర్మాతలుగా మారి హీరో రాజ్ తరుణ్ తో ఓ సినిమా నిర్మించబోతున్నారని.. వాళ్ళ బేనర్ లో రాజ్ తరుణ్ సినిమానే ఫస్ట్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. రాజ్ తరుణ్ కెరీర్ తొలినాళ్లలో దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా చేస్తే అది డిజాస్టర్ అయ్యింది. అయితే అదే దర్శకుడు తాజాగా చైతూ .. సమంతలకు ఒక కథను వినిపించాడట. ఆ కథ రాజ్ తరుణ్ కి కరెక్ట్ గా సరిపోతుందని.. చైతు- సమంత కి కథ నచ్చి తమ బ్యానర్ లో ఆ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట.