అక్కడ షాక్.. ఇక్కడ క్లారిటీ?
గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 నుండి మూడో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి.. బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున పక్కన [more]
గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 నుండి మూడో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి.. బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున పక్కన [more]
గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 నుండి మూడో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి.. బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున పక్కన ఒకింత షాక్ లోనే ఉండిపోయింది. అసలు ఎలిమినేట్ అవుతానని ఊహించనైనా ఊహించని కంటెస్టెంట్ దేవి. అటు ప్రేక్షకులు ఇటు దేవి కూడా ఈ ఎలిమినేషన్ ని ఎక్సపెక్ట్ చెయ్యలేదు. అందుకే ఆ షాక్ లో బిగ్ బాస్ గురించి, కంటెస్టెంట్స్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడింది దేవి. దేవి స్పీచ్ కి అందరూ ముగ్దులయ్యారు. ఇక బయటకొచ్చాక కొన్ని ఇంటర్వూస్ లోను బిగ్ బాస్ గురించి చాలా చక్కగా మాట్లాడింది దేవి నాగవల్లి. కానీ తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవి బిగ్ బాస్ నుండి బయటికి రావడంపై ఓ క్లారిటీకి వచ్చినట్టుగా అనిపిస్తుంది.
బిగ్ బాస్ గురించి ఎవరెన్ని మాట్లాడిన తనకి బిగ్ బాస్ మీద మంచి ఆభిప్రాయం ఉందని.. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ప్రకారం నడుస్తుంది ఆనుకున్నానని, కానీ బిగ్ బాస్ లో అలాంటిదేం లేదని… తాను ఫెయిర్ గేమ్ ఆడా అని అంటుంది. కానీ తాను బయటికి వచ్చాక ఈ ఎలిమినేషన్స్ లో ఏదో గందరగోళం జరిగింది అని అనిపిస్తుంది అని.. నా ఫ్రెండ్స్, వెల్వెషర్స్ అంత నువ్ బయటికి రావడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారని…. ఇక బిగ్ బాస్ లో కొంతమంది స్కిప్ట్ రాసుకుని గేమ్ ఆడుతున్నారేమో.. తాను గనక అక్కడ ఉంటె స్క్రిప్ట్ బ్రేక్ అవుతుంది అని తనని ఎలిమినేట్ చేశారేమో అంటుంది. ఇక తనకి ఓట్స్ పడని కారణంగా ఎలిమినేట్ చేశారన్నారు.. కానీ నాకన్నా మెహబూబ్ లాంటివాళ్లు వెనక ఉన్నారు.. అలాంటిది నాకు ఓట్స్ రాకపోవడం అనేది నాకు నచ్ఛలేదు అంటుంది.
ఓట్స్ తక్కువవచ్చిన వారిని షోలో ఉంచి తనని ఎలిమినేట్ చెయ్యడం ఏమిటో తనకి అర్ధం కాలేదు అంటుంది దేవి. ఇక బయటికొచ్చాక గీత మాధురి, అలీ రెజా, శ్యామల లాంటి వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎలిమినేట్ అవడం బాధగా ఉందని, అసలు నచ్చలేదు అంటున్నారని చెప్పిన దేవి నాగవల్లి… ఇందులో ఏదో మతలబు ఉన్నట్టుగా తనకి అనిపిస్తుంది అని.. ఉన్నట్టుండి స్ట్రాంగ్ గా ఉన్న తనని బయటికి పంపడం తనకి నచ్చలేదని చెబుతుంది. ఇక మరోసారి బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వస్తే వదలను అంటుంది. అయితే కోవిడ్ కారణంగా మళ్ళీ బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఉండకపోవచ్చనేది దేవి అభిప్రాయం