బిగ్ బాస్ విషయంలో వితిక అంత బాధపడిందా?
బిగ్ బాస్ అంటే క్రేజొస్తుంది, ఫేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది అనుకుని చాలామంది బిగ్ బాస్ కి వెళతారు. కొంతమందికి ఇవేం కాకపోయినా అసలు బిగ్ బాస్ [more]
బిగ్ బాస్ అంటే క్రేజొస్తుంది, ఫేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది అనుకుని చాలామంది బిగ్ బాస్ కి వెళతారు. కొంతమందికి ఇవేం కాకపోయినా అసలు బిగ్ బాస్ [more]
బిగ్ బాస్ అంటే క్రేజొస్తుంది, ఫేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది అనుకుని చాలామంది బిగ్ బాస్ కి వెళతారు. కొంతమందికి ఇవేం కాకపోయినా అసలు బిగ్ బాస్ హౌస్ ఎక్సపీరియెన్స్ ఎలా ఉంటుందో చూడడానికి వెళతారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ వితిక బిగ్ బాస్ కి వెళ్ళింది క్రేజ్ వస్తుందనో.. లేదంటే ఫేమ్, డబ్బు వస్తాయనో వెళ్లలేదట.. బిగ్ బాస్ హౌస్ ఎక్సపీరియెన్స్ ఎలా ఉంటుందో చూడడానికే వెళ్ళా అంటుంది. వితిక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక బయట తాను ఫేస్ చేసిన పరిస్థితులని ఓ వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. తాను బిగ్ బాస్ కి వెళ్ళాక 13 వారాలు ఉన్నది.. తన స్టామినా వలన, క్రేజ్ వలన ఉన్నా అని అనుకుందట. అయితే 13 వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటపెద్దక తాను చాలా వరెస్ట్ సిట్యువేషన్ ని ఫేస్ చేశా అని.. తన మీద మాత్రమే కాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ప్రతి కంటెస్టెంట్ మీద నెగటివ్ ట్రోలింగ్, మీమ్స్ సోషల్ మీడియాలో తమ మీద చీప్ కామెంట్స్ తనని చాల బాధించాయంట. 24 గంటల సమయంలో బిగ్ బాస్ కేవలం ఓ గంట మాత్రమే తమని చూపిస్తారని.. ఓ గంటకే తమ మీద ఓ చెత్త అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో పెంచుకున్నారంటుంది.
ఇక ఫ్రెండ్స్ అయితే తాను బిగ్ బాస్ కి వెళ్ళకముందు రేపు వెళ్తా అనగా అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పి దగ్గరుండి సాగనంపారని… కానీ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక తనని శత్రువులా చూడడం కాదు… నువ్వెంటి ఇలా అన్నట్టుగా వారు చూస్తున్నారని… నేను ఈ సిట్యువేషన్ వలన కొన్ని నెలలు బాధపడ్డా అని.. ఫ్రెండ్స్ కాదు మనకు ముఖ్యం ఫ్యామిలీనే తనకి సపోర్ట్ చేసింది అని చెబుతుంది వితిక సేరు. బిగ్ బాస్ చూసి ఓ అభిప్రాయానికి వచ్చి మా కేరెక్టర్ గురించి మీరెలా ఓ నిర్ణయానికి వస్తారు.. నేను బిగ్ బాస్ కి వెళ్ళింది సినిమాలు చెయ్యాలనే ఉద్దేశ్యంతో కాదు.. నేను పెళ్లి చేసుకున్నది ఎందుకు సినిమాలకు దూరమవడానికే అంటూ షాకిచ్చింది. ఇక బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్లందరికీ ఇలాంటి నెగెటివ్ ట్రోలింగ్, మీమ్స్ బాధపెట్టాయని.. కానీ ఇప్పటినుండి అయినా అలాంటి మీమ్స్ కానీ, నెగెటివ్ ట్రోల్ చెయ్యొద్దు అని.. మా ఫ్యామిలీస్ వాటి వలన సఫర్ అవుతాయంటూ హితవు పలికింది.