మహేష్ బ్యాంక్ మేనేజర్ కొడుకా?
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ తర్వాత వంశి పైడిపల్లికి కమిట్ అయ్యి కూడా పరశురాంతో సినిమా చేస్తున్నాడు. వంశీతో చెయ్యను అని చెప్పడం లేదు.. [more]
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ తర్వాత వంశి పైడిపల్లికి కమిట్ అయ్యి కూడా పరశురాంతో సినిమా చేస్తున్నాడు. వంశీతో చెయ్యను అని చెప్పడం లేదు.. [more]
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ తర్వాత వంశి పైడిపల్లికి కమిట్ అయ్యి కూడా పరశురాంతో సినిమా చేస్తున్నాడు. వంశీతో చెయ్యను అని చెప్పడం లేదు.. అలాగే చేస్తానని భరోసా ఇవ్వకుండా మధ్యలోకి పరశురామ్ ని తీసుకొచ్చాడు. పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమాని పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టినా కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడప్పుడే సినిమా సెట్స్ మీదకి వెళ్లేలా లేడు మహేష్ బాబు. కరోనా తీవ్రత తగ్గాకే షూటింగ్ అని చెబుతున్నాడట. అయితే ఈ సినిమాలో మహేష్ కోసం మహానటి కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేసిందట చిత్ర బృందం.
అయితే మహేష్ – పరశురామ్ సినిమా అనుకున్నప్పటినుండి మహేష్ – పరశురామ్ సినిమా కథ విషయంలో సోషల్ మీడియాలో ఒకే న్యూస్ ప్రచారం లో ఉంది. సోషల్ మెసేజ్ ని టచ్ చేస్తూ..ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఓ బ్యాంక్ మేనేజర్ కి కొడుకుగా నటించబోతున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో కొత్తగా చక్కర్లు కొడుతోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు…. ఆ ప్రయత్నంలో ఎన్ని ఒడిడుకులు ఎదుర్కొన్నాడో అనే పాయింట్ మీదే కథ ఉండబోతుంది. ఇక మహేష్ కి హీరోయిన్ కీర్తి సురేష్ కి మధ్యన అందమైన రొమాంటిక్ ట్రాక్ కూడా సినిమాలో హైలెట్ అయ్యేలా ఉండబోతుంది అని అంటున్నారు. మరి ఈ సినిమా ఆగష్టు నుండి కాక డిసెంబర్ నుండి పట్టాలెక్కే ఛాన్స్ కనబడుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్.