బాలయ్య కడుపులో ఏముంది?
బాలకృష్ణ ఇప్పుడు ఎక్కువగా మెగాస్టార్ చిరుని టార్గెట్ చేస్తూ ఆదిరిపోయే మాటలతో అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మామూలుగానే బాలయ్య మాట్లాడితే ఎవ్వరికి ఓ పట్టాన అర్ధం కాదు. [more]
బాలకృష్ణ ఇప్పుడు ఎక్కువగా మెగాస్టార్ చిరుని టార్గెట్ చేస్తూ ఆదిరిపోయే మాటలతో అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మామూలుగానే బాలయ్య మాట్లాడితే ఎవ్వరికి ఓ పట్టాన అర్ధం కాదు. [more]
బాలకృష్ణ ఇప్పుడు ఎక్కువగా మెగాస్టార్ చిరుని టార్గెట్ చేస్తూ ఆదిరిపోయే మాటలతో అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మామూలుగానే బాలయ్య మాట్లాడితే ఎవ్వరికి ఓ పట్టాన అర్ధం కాదు. ఇప్పుడు కూడా బాలయ్య చిరుని డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యకుండా పార్ట్ లు పార్ట్ లుగా టార్గెట్ చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు. నేడు బాలకృష్ణ 60 వ పుట్టినరోజు సందర్భంగా మూడురోజుల ముందు నుండే ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వ్యూ ఇవ్వడమే కాదు… అవకాశం వచ్చినప్పుడు హాట్ హాట్ గా మాట్లాడుతూ ఎదుటి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ జయంతి నాడు ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ జరుగుతుంది అని మాట్లాడి… అందరిని అయోమయంలో పడేసిన బాలయ్య తర్వాత చిరుని డైరెక్ట్ గా టార్గెట్ చేసి.. మా ఈవెంట్ పై మాట్లాడాడు.
అమెరికాలో మా ఈవెంట్ ప్లాన్ చేసి ఐదు కోట్లకి ఒక కోటి తెచ్చారని.. ఆ ఈవెంట్ కి నను పిలవలేదు, నేను లెక్కలడగలేదు, నేను లెక్కల మాస్టర్ ని కాదు అంటూ ఏదేదో మాట్లాడేసాడు. తాజాగా చిరుతో మీకు పర్సనల్ గా ఏమైనా విభేదాలున్నాయా.. ఎప్పుడూ మేము ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో చిరు నాకు సన్నిహితుడు అంటారు, బయటెక్కడైనా చిరు కనబడినా.. హగ్ చేసుకుని ముచ్చట్లు పెడతారు కదా.. అని అడగగా.. ప్రతి సంవత్సరం 80వ దశకానికి చెందిన నటీనటులందరం ఒక చోట కలిసి అల్లరల్లరి చేసి..స్ సరదాగా గడిపే వాళ్లమని.. చెన్నై, బెంగళూరుల్లో జరిగిన వేడుకలకు తాను కూడా రజిని, కమల్, చిరు, వెంకటేష్ లతో కలిసి హాజరయ్యానని.. కానీ గత ఏడాది చిరంజీవి ఇంట్లోనే ఈ వేడుక జరగ్గా దానికి చిరు తనను ఆహ్వానించలేదని బాలయ్య అన్నాడు.
ఇతర సిటీస్ లో అంటే ఎక్కడెక్కడజరిగిన వేడుకల్లో తాము కలిసి పాల్గొన్నామని.. కానీ హైదరాబాద్ లోని చిరు ఇంట్లో జరిగిన వేడుకకు తనను ఎందుకు పిలవలేదో తనకు తెలియదని.. చిరుకే తెలియాలని బాలయ్య అన్నాడు. అంటే అది కడుపులో పెట్టుకుని బాలయ్య ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నాడా? అంటే అదే అనుకోవాలి. లేదంటే చిరు పెద్దగా వ్యవహరించడం బాలయ్యకి నచ్చలేదా? కాదు ఎవరూ తనని పిలవకుండా పనులు కానిచ్చేస్తున్నారని కడుపుమంటా? ఏది ఏమైనా బాలయ్య కడుపులో ఏదో ఉంచుకుని ఇలా చిరు ని టార్గెట్ చెయ్యడం మాత్రం తమకి నచ్చడం లేదంటున్నారు మెగా ఫాన్స్.