Tue Nov 28 2023 16:18:10 GMT+0000 (Coordinated Universal Time)
చిరుకు, ప్రభుదేవాకు ఎక్కడ చెడింది...!

ఆన్‌స్క్రీన్‌లో మెగాస్టార్ చిరంజీవి వేసే స్టెప్పులు ఆయనకు ఇండియన్ మైఖేల్జాక్సన్ అనే పేరు తెచ్చిపెట్టాయి. ఇదంతా ప్రభుదేవా కేవలం
కొరియోగ్రాఫర్‌గా మాత్రమే ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత ప్రభుదేవా ఆన్ స్క్రీన్ మీద కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో, ఆ తర్వాత హీరోగా, ఇలా పరిణామం చెందే క్రమంలో ఆన్ దిస్క్రీన్, ఆఫ్ ది స్క్రీన్కూడా ప్రభుదేవాకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ పేరు తెరపైకి వచ్చింది. ఇక ఆన్ దిస్క్రీన్ ఆయన హవా కోలీవుడ్, టాలీవుడ్లను దాటి బాలీవుడ్‌కి కూడా చేరింది. దాంతో దేశవ్యాప్తంగా ప్రభుదేవాకు ఉన్న ఇమేజ్ అనూహ్యంగా పెరిగింది. కేవలం ఆయన పాటల్లో స్టెప్స్ కోసమే రిపీట్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేంతగా ఈ ఇమేజ్ డెవలప్ అయింది. ఇక ప్రభుదేవా ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగి, చిరు ఇమేజ్ను డ్యామేజ్ చేశాడు. వాస్తవానికి ప్రభుదేవాకు హీరోని బట్టి, ఆయన స్టైల్‌కు అనుగుణంగా స్టెప్స్ కంపోజ్ చేయడం పెద్దగా చేతకాదు. ఆ విషయాన్ని ఓ బాలీవుడ్ పత్రికలో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. అలాంటి అవకాశాలు వచ్చినా కొన్ని వదిలేశానని, తాను అలా కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా చాలా దారుణంగా ఫెయిలయ్యాయని అప్పుడెప్పుడో చెప్పుకోచ్చాడు.
తాను టాలీవుడ్‌కి కంపోజర్‌గా పరిచయం అయ్యే దశలో ప్రభుదేవా కొన్ని చిరు పాటలకు కూడా డ్యాన్స్ కంపోజ్ చేశాడు. అవి బాగానే హిట్టయ్యాయి. ఆ పాటలకు కూడా ప్రభుదేవా కేవలం ట్యూన్స్‌ని బట్టి మాత్రమే డ్యాన్స్ కంపోజ్ చేశాడట. ఆ వయసులో చిరంజీవి ఎలాంటి స్టెప్పులనైనా, ఎంతటి క్లిష్టమైన స్టెప్పులనైనా ఒకే టేక్‌లో ఇరగదీసే వయసులో, ఆయన ఎనర్జీలెవల్స్ ఆ స్దాయిలో ఉన్నాయి. దాంతో ప్రభుదేవా కొన్ని క్లిష్టమైన స్టెప్స్‌ను కంపోజ్ చేసినా కూడా చిరు వాటికి తెరపై నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. దాంతో ఆ పాటలు అంతలా పాపులర్ అయ్యాయి. అయితే వయసు పెరిగే కొద్ది ఎనర్జీ లెవల్స్ తగ్గిపోయాయి. దాంతో క్లిష్టమైన స్టెప్లను వేయడం మానివేసి, తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ స్టెప్పులనే చిరు ఒప్పుకునే వరకు వచ్చింది.
కానీ ప్రభుదేవా దీనికి విరుద్దం, దాంతో చిరంజీవి తప్పనిసరి పరిస్థితుల్లో తన బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా స్టెప్స్ కంపోజ్ చేస్తున్న న్యూ టాలెంట్‌ను, అదే దారిలో నడుస్తున్న సీనియర్లను ఎక్కువగా ప్రోత్సహించాడు. అలా చిరు పరిచయం చేసిన వారి లిస్ట్ లారెన్స్ నుండి చాంతాడంత ఉంటుంది. అలా పనిచేసిన వారితో చిరుకు బాగా ట్యూన్ కుదిరింది. దాంతో కొంతకాలం ఆయన ప్రభుదేవాను పక్కనపెట్టాడు. ఈ ఫరిణామం ప్రభుదేవాకు కూడా నచ్చింది. చిరంజీవి బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా స్టెప్స్ కంపోజ్ చేయాలనే దర్శకనిర్మాతల ఒత్తిడి తగ్గింది. ఇక చివరకు ప్రభుదేవా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బాలీవుడ్ 'లగే రహో మున్నాబాయ్' రీమేక్‌గా చిరు నటించిన 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రానికి తాను కేవలం దర్శకత్వం మాత్రమే వహిస్తానని, కంపోజర్‌గా పనిచేయనని ప్రభుదేవా చెప్పేంత వరకు వెళ్లింది. ఇక ఈమధ్యకాలంలో ప్రభుదేవా కంపోజ్ చేస్తున్న సాంగ్స్ ఫ్లాప్ అవుతున్నాయి. బాలీవుడ్లో కూడా అదే పరిస్దితి.
దీంతోనే చిరంజీవికి ఈమధ్య కాలంలో ప్రభుదేవాపై ఉన్న నమ్మకం తగ్గింది. దాంతో తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'లో ప్రభుదేవాకు అవకాశం ఇవ్వలేదని చిరు వర్గీయులు అంటున్నారు. కానీ ప్రభుదేవా ఇటీవల అనేక చోట్ల మీ గోల్ ఏమిటి? అని అడిగితే చిరంజీవి గారి డ్యాన్స్‌ను ఆకాశానికి ఎత్తేసి, ఆయన 150 వ చిత్రంలో డ్యాన్స్ కంపోజ్ చేయాలనే కోరికను వెల్లబుచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు పొందిన తమ ప్రభుదేవాను చిరు అవమానించాడని, నోరు తెరిచి అడిగినా అవకాశం ఇవ్వకుండా ప్రభుదేవాను కించపరిచాడని ఆయన సంబంధికులు చిరును తప్పు పడుతున్నారు.
Next Story