Sun Jul 03 2022 09:13:13 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించి మంచిపని చేశారట!!

చిరంజీవి మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సినిమాకి ఏ దర్శకుడైతే బావుంటుందో అని తెగ సెర్చ్ చేశారు మెగా ఫ్యామిలీ వాళ్ళు. అసలే చిరు 9 ఏళ్ళ తర్వాత మొహానికి మేకప్ వేసుకోవడం ఒక విశేషమైతే.... అది చిరు కెరీర్ కి యమ ఇంపార్టెంట్ సినిమా అవ్వడం ఒక విశేషం. చిరు కెరీర్ లో ఒక మైలు రాయిని అందుకునే ఆ సినిమా 150 వ సినిమా కావడం కూడా దానికి అంత ప్రత్యేకత ఏర్పడింది. మెగా ఫ్యామిలీ చిరు 150 వ సినిమా చేసే డైరెక్టర్ ని వెతికే వేటలో ఒకసారి పూరి జగన్నాథ్ ని కూడా అనుకున్నారు. ఇక పూరి కూడా ఒక మాస్ కథని వినిపించినట్లు వార్తలొచ్చాయి. ఇక ఆ మాస్ కథకి ఆటోజానీ అని టైటిల్ కూడా పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ కథ కొంచెం చిరుకి నచ్చిన మరి కొంత నచ్చక పోవడం వల్లే పూరీని డైరెక్టర్ లిస్ట్ నుండి తప్పించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయం పూరికి నేరుగా చెప్పకుండా పూరీని హోల్డ్ లో పెట్టారు మెగా ఫ్యామిలీ వాళ్ళు. ఇది తెలుసుకున్న పూరి మెగా ఫ్యామిలీ చేసిన అవమానం తట్టుకోలేక మళ్ళీ మెగా ఫ్యామిలీ కుర్రాడైన నాగబాబు కొడుకు వరుణ్ తో లోఫర్ తీసి చేతులు కాల్చుకున్నాడు. ఇక ఈ మధ్యన పూరి, కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం చిత్రం చేసి మళ్ళీ అదే తప్పు చేసాడు. ఆ చిత్రం కూడా ప్లాపు లిస్ట్లోకెళ్ళిపోయింది.
అయితే చిరంజీవి 150 వ సినిమాకి పూరిని తీసుకోక పోవడం కరెక్ట్ అనే వాదన ఇప్పుడు మెగా ఫ్యామిలి లో బయలుదేరింది. ఎందుకంటే లోఫర్, ఇజం వరుస ప్లాపులు తీసిన పూరి మెగాస్టార్ 150 చిత్రాన్ని ఇంకెలా తీసి అభాసుపాలు చేసేవాడో అని వాపోతున్నారట. ఇక పూరీని 150 చిత్ర దర్శకుడిగా తప్పించి మంచి పని చేశామని సంబరపడుతున్నారని టాక్. పాపం పూరి పరిస్థితి చూసారా రెండు మూడు సినిమాల ప్లాపుతో ఎంతగా పాతాళం లోకి జారిపోయాడో కదా..! ఇక మళ్ళీ పూరి లేవడానికి కొంచెం టైం పట్టినా ఈసారి కంపల్సరీ ఒక హిట్ కొట్టాలి లేకుంటే పూరి పని అవుటనే కామెంట్స్ వినబడుతున్నాయి.
Next Story