జగన్ బిందాస్..వారికి మాత్రం…??

ఏపీ విపక్షం వైసీపీలో తీవ్రమైన టెన్షన్ నెలకొంది. ఒక మహాఘట్టానికి మరి కొద్ది రోజుల్లో ముగింపు పలకబోతున్న పార్టీ అధినే త జగన్.. ఆ వెంటనే తీసుకునే నిర్ణయం ఏంటి? ఎలాంటి వ్యూహాన్ని ఆయన రెడీ చేసుకున్నారు? ఏవిధంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారనే విషయంపై పార్టీలో నేతల మధ్య తీవ్రస్తాయిలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని గమనించినప్పుడు అధికార టీడీపీ దూకుడు ప్రదర్శించేందుకు రెడీ అవుతోంది. జనవరి నెల రెండు లేదా మూడో వారం నాటికి దాదాపు 100 మంది అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. అదేసమ యంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే వారికి ఎక్కువ ప్రాధాన్యం పెంచుతున్నారు. ఈ పరిస్థితిని గమనిస్తే.. జగన్ ఎలా ముందుకు వెళ్తారనే ప్రశ్న సాధారణంగానే తెరమీదికి వస్తుంది.
అభ్యర్థులను ప్రకటిస్తారా?
ఇక అదేసమయంలో టీడీపీతో పోటి పడి తాను కూడా 100 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారా? అనేది కీలక విషయంగా మారింది.పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులకు ఛాన్స్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో వారంతా ఎదురు చూస్తున్నారు. ఇక, ఇప్పటి వరకు జగన్ తాను మాత్రమే ప్రజల్లోకి వెళ్లాడు. మరి ఇకపై.. ఎలా ముందడుగు వేస్తాడు? అనేది కీలక అంశంగా మారింది. రాష్ట్రంలో పాదయాత్ర ముగించిన తర్వాత బస్సు యాత్రకు సిద్ధం అవ్వాలని నిర్ణయించినా.. దీని కంటే కూడా నేతలను ప్రజల్లోకి పంపించి లబ్ధి పొందాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదని నాయకులు అంటున్నారు. కానీ, జగన్ వ్యూహం వేరేగా ఉందని అంటున్నారు.
టీడీపీ ప్రకటించిన తర్వాతేనా?
ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తే.. రెండు రీజన్లు కనిపిస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునే అవకాశం పాజిటివ్‌గా కనిపిస్తుండగా.. టికెట్ ఆశించిన వారు వారికి టికెట్ లభించక నిరాశకు గురైతే.. రెబల్‌గా మారినా.. లేదా వేరే పార్టీలోకి జంప్ చేసినా.. ఏంటి పరిస్థితి? అనేది కూడా కీలకమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటించే వ్యూహం కన్నా.. కూడా అభ్యర్థులను నిర్ణయించి ప్రకటించకుండా, వారికి పరోక్షంగా సంకేతాలిచ్చి బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నది వైసీపీ కీలక నేతల అభిప్రాయం. దీనివల్ల అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లడం, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజల్లోనూ అభ్యర్థిపైన నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే వైసీపీ నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపత్యంలో జగన్ ఈ నెల 9తో ముగియనున్న పాదయాత్ర అనంతరం తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±