షర్మిల పార్టీతో తొలి దెబ్బ ఆ పార్టీకేనట ?
వైఎస్ షర్మిల. రాజశేఖరరెడ్డి ముద్దుల తనయ. మంచి మాటకారి. హాట్ కామెంట్స్ చేయడంతో స్పెషలిస్ట్. ముక్కు సూటిగా వ్యవహరించే మహిళా నేత. వైఎస్ షర్మిల నాయకత్వ లక్షణాలు [more]
వైఎస్ షర్మిల. రాజశేఖరరెడ్డి ముద్దుల తనయ. మంచి మాటకారి. హాట్ కామెంట్స్ చేయడంతో స్పెషలిస్ట్. ముక్కు సూటిగా వ్యవహరించే మహిళా నేత. వైఎస్ షర్మిల నాయకత్వ లక్షణాలు [more]
వైఎస్ షర్మిల. రాజశేఖరరెడ్డి ముద్దుల తనయ. మంచి మాటకారి. హాట్ కామెంట్స్ చేయడంతో స్పెషలిస్ట్. ముక్కు సూటిగా వ్యవహరించే మహిళా నేత. వైఎస్ షర్మిల నాయకత్వ లక్షణాలు గత పదేళ్ళుగా ఉమ్మడి ఏపీ జనం చూశారు. జగన్ కి కూడా పెద్దగా తెలియని తెలంగాణా ప్రాంతాల్లో తన పాదయాత్ర ద్వారా షర్మిల కలియతిరిగి అక్కడి జనాలకు చేరువ అయ్యారు. అన్నింటికీ మించి వైఎస్సార్ రూపం, ఆయన చిరునవ్వు. హావభావాలు షర్మిలకు ఇపుడు ప్లస్ పాయింట్లు అవుతాయని అంటున్నారు.
సరైన సమయమా..?
ఇపుడు తెలంగాణాలో పార్టీ పెట్టడం అంటే సరైన వ్యూహమే అని అంటున్నారు. తెలంగాణా ఉద్యమం దాని ఫలితాన్ని పూర్తిగా టీయారెస్ కేసీయార్ వాడుకున్నారు. ప్రజలు కూడా రెండు సార్లు కేసీయార్ ని సీఎంని చేసి ఆదరించారు. ఇక పెద్దాయన మీద మోజు తగ్గిందని దుబ్బాక ఉప ఎన్నికతో పాటు తాజాగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు రుజువు చేశాయి. మరో వైపు చూస్తే కేసీయార్ కి సరైన పోటీ ఇచ్చే నాయకత్వం విపక్షంలో లేదు. కాంగ్రెస్ కి క్యాడర్ బలంగా ఉన్నా సరైన లీడర్ లేడు, ఇక తెలుగుదేశం పరిస్థితి అలాగే ఉంది. బీజేపీకి హైదరాబాద్ చుట్టు పక్కల ప్యాకెట్లు తప్ప మొత్తం తెలంగాణా అంతటా విస్తరించిన బలం లేదు. దాంతో వైఎస్ షర్మిల కనుక సొంత పార్టీ పేరిట రంగంలోకి వస్తే ఆదరిస్తారు అంటున్నారు.
అదే తారక మంత్రం….
మీ రాజన్న బిడ్డను వచ్చాను, రాజన్న రాజ్యం తెస్తాను అంటూ కనుక వైఎస్ షర్మిల తెలంగాణా జనాల్లోకి వస్తే కచ్చితంగా ఆ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. తెలంగాణా సమాజంలో రాజన్న ఇంకా బతికే ఉన్నారు. ఆయన అయిదుంపావు ఏళ్ళ పాటు చక్కని పాలన అందించారు. ఆయన మీద మోజు ఇంకా అలాగే ఉండగా దుర్మరణంపాలు అయ్యారు. దాంతో ఆయన తనయగా, ఆడబిడ్డగా షర్మిల కనుక వస్తే తెలంగాణాలో ఆమెకు బ్రహ్మరధం పడతారు అన్న అంచనాలు ఉన్నాయి.
డైరెక్ట్ కనెక్షన్….
రాజకీయాల్లో ప్రజలతో డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకున్న నాయకులు బహు అరుదు. అలా కనుక చూసుకుంటే ఎన్టీయార్, వైఎస్సార్, కేసీయార్ జగన్ తరువాత షర్మిల కూడా ఉంటారు. ఆమె జనం గుండె చప్పుడుని పసిగట్టి వారితో మాట్లాడగలరు, వారి బాధలలో తాను ఉన్నానని చెప్పగలరు, ఇపుడు తెలంగాణాలో రాజకీయం చూస్తే అయోమయంగానే ఉంది. టీయారెస్ మీద వ్యతిరేకత ఉన్నా బీజేపీని ఆదరించలేకపోతున్నారు. కాంగ్రెస్ లో లీడర్ ఎవరో తెలియదు దాంతో షర్మిల రూపంలో కొత్త నాయకత్వం వస్తే కచ్చితంగా జనం సమాదరిస్తారు అనే అంటున్నారు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం దశాబ్ద కాలంగా అధికారం లేక రగిలిపోతోంది. దానికి తోడు వైఎస్సార్ ని బాగా ఇష్టపడే దలితులు , బడుగులు, మైనారిటీలతో బలమైన ఓటు బ్యాంక్ షర్మిల కొత్త పార్టీకి సమకూరుతాయని అంటున్నారు. అలా కనుక చూసుకుంటే షర్మిల పార్టీ ద్వారా తొలి దెబ్బ కాంగ్రెస్ కే పడబోతోంది అని చెప్పాలి.