బీజేపీ నోట జగన్ బెయిల్ రద్దు మాట ?
తెలుగుదేశం పార్టీ ఎపుడు జగన్ జైలూ బెయిలూ గురించి గట్టిగా మాట్లాడుతుంది. కానీ బీజేపీ ఈ విషయంలో ఎపుడూ పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. జగన్ [more]
తెలుగుదేశం పార్టీ ఎపుడు జగన్ జైలూ బెయిలూ గురించి గట్టిగా మాట్లాడుతుంది. కానీ బీజేపీ ఈ విషయంలో ఎపుడూ పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. జగన్ [more]
తెలుగుదేశం పార్టీ ఎపుడు జగన్ జైలూ బెయిలూ గురించి గట్టిగా మాట్లాడుతుంది. కానీ బీజేపీ ఈ విషయంలో ఎపుడూ పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. జగన్ ని నాడు జైలులో పెట్టిన సందర్భంలో కూడా బీజేపీకి చెందిన సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లోనే యూపీయే పెద్దలను ఒక్క లెక్కన కడిగిపారేశారు. అన్యాయంగా సీబీఐని ఉపయోగించుకుని జగన్ ని జైలు పాలు చేశారని కూడా ఆమె దుయ్యబెట్టారు. సరే ఆమె ఇపుడు లేరు. అయినా సరే బీజేపీ ఇతర నాయకులు కూడా ఎపుడూ జగన్ మీద ఉన్న కేసుల గురించి కానీ ఆయన జైలు విషయం కానీ పెద్దగా ప్రస్థావించిన సందర్భం లేదు
సోము వీరావేశం…
బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే తమ విమర్శలను అన్నీ కూదా చంద్రబాబు మీదకే ఎక్కు పెడతారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అటువంటి ఆయన వైసీపీ అగ్రనేతల బెయిల్ రద్దు అన్న మాటలను చాలా సీరియస్ గానే వాడారు. ఆయనకూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి జరిగిన ట్విట్టర్ యుద్ధంలో ఒకరికి ఒకరు మాటలిచ్చిపుచ్చుకున్నారు. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా బెయిల్ రద్దు అయితే మీరు జైలుకే అంటూ వీర్రాజు చేసిన హాట్ కామెంట్ ఇపుడు చర్చగా ఉంది.
ఆలోచన ఉందా …?
అంటే ఏపీలో జగన్ ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఏదైనా బీజేపీకి ఉందా అన్న చర్చ కూడా సోము మాటలను బట్టి మొదలవుతోంది. జగన్ ఏపీలో అతి బలవంతుడిగా మారుతున్నాడు. ప్రజా క్షేత్రంలో ఆయన్ని ఎదుర్కోలేము అన్న భావన ఎపుడో కలిగింది. దాంతో ఇతర మార్గాల ద్వారానే యుద్ధం చేస్తామని బీజేపీ అనుకుంటే వారిని ఆపేవారు ఎవరూ లేరు కూడా. నాడు యూపీయే సర్కార్ జగన్ మీద అక్రమ కేసులు బనాయించినపుడు అయ్యో పాపం అన్నారే కానీ ఎవరూ ఎదురెళ్ళి నాటి కేంద్ర పాలకులను నిగ్గదీయలేకపోయారుగా. పైగా ఇది రాజకీయం. పచ్చి అవకాశవాదం కూడా. ఇలాగే కత్తులు దూస్తారు అని కూడా చెప్పాల్సివుంటుంది.
జరిగే పనేనా …?
జగన్ బెయిల్ ని రద్దు చేయాలని ఎవరైనా కోరితే కోర్టు ద్వారా దానికి అంగీకారం వస్తే క్షణాల్లో జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిపోతారు. ఇవన్నీ అసాధ్యమైన విషయాలు ఏవీ కావు. పైగా అతి బలవంతులు, దూకుడుగా రాజకీయం చేసేవారూ ఢిల్లీలో ఉన్నారు. ఇక ఏపీ వరకూ చూస్తే బీజేపీకి కనీసం కాలూనడానికి కూడా చోటు లేదు. మరో వైపు చూస్తే అఖిల భారతాన కూడా బీజేపీ ప్రభ వెలవెలబోతోంది. ఈ పరిస్థితుల్లో కనీసం బ్లాక్ మెయిల్ చేయడానికైనా బీజేపీ వారు బెయిల్ రద్దు అన్న దాన్ని ఉపయోగించుకుంటారు అన్నది ఒక విశ్లేషణ. విజయసాయిరెడ్డి తిరుపతిలో బీజేపీకి డిపాజిట్లు రావు అంటే ఏకంగా బెయిల్ రద్దు అయి జైలుకు పోతారు అని సోము వీర్రాజు ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా ఇక్కడ ఆలోచించాలి. మొత్తానికి సోము వీర్రాజు నోటి వెంట వైసీపీ వినకూడని మాట వచ్చింది. మరి రేపు జరగకూడనివి జరిగినా ఎదుర్కొనేందుకు ఆ పార్టీ పెద్దలు సిద్ధంగా ఉండాల్సిందే.