ఇదే అసలు టైం అట…. అందుకే వాయిదా వేశారట
బడ్జెట్ సమావేశాలు మరో మూడు నెలలు వాయిదా పడినట్లే. ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తేవడంతో జీతభత్యాలకు ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతనే [more]
బడ్జెట్ సమావేశాలు మరో మూడు నెలలు వాయిదా పడినట్లే. ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తేవడంతో జీతభత్యాలకు ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతనే [more]
బడ్జెట్ సమావేశాలు మరో మూడు నెలలు వాయిదా పడినట్లే. ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తేవడంతో జీతభత్యాలకు ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్ని జగన్ యోచనగా ఉంది. అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసేసి సగర్వంగా సభలోకి అడుగుపెట్టాలన్నది ఒక ఆలోచన. అయితే జగన్ మరో ఆలోచన కూడా టీడీపీ అధినేత చంద్రబాబును భయపెడుతోంది.
తనను అమర్యాదగా….
నిజానికి బడ్జెట్ సమావేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటనుకుంటున్నారా? చంద్రబాబు ఇప్పటికీ తనపై ఒంటికాలు మీద లేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తనను ఫ్యాక్షనిస్టుగా, ఉన్మాదిగా మాట్లాడుతున్నారు. ఇది జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. చంద్రబాబును మరింత మానసిికంగా ఇబ్బంది పెట్టాలన్నది జగన్ భావన. ఇందుకోసం మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ సీనియర్ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఎవరినీ చేర్చుకోకూడదనుకున్నా….
జగన్ టీడీపీ నుంచి వైసీపీలోకి ఎవరినీ చేర్చకోకూడదనుకున్నారు. 23 స్థానాలకే పరిమితమైన టీడీపీ కుక్కిన పేనల్లే పడి ఉంటుందని జగన్ భావించారు. కానీ 23 మంది తో ఉన్న టీడీపీ మండలిలో తన బలం చూసుకుని రెచ్చిపోతుండటంతో నలుగురు ఎమ్మెల్యేలను అనధికారికంగా వైసీపీ మద్దతుదారులుగా మార్చారు. జగన్ ను నమ్మిన చంద్రబాబు తొలినాళ్లలో ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోలేదు.
ప్రతిపక్ష హోదాకు….?
అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడంతో జగన్ మరో ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదాను తీసివేయడంతోనే ఆయనను కంట్రోలో చేయవచ్చని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలకు మరో మూడు నెలలు గడువు ఉండటంతో ఈ లోపు కొందరు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఇందుకు ఇదే మంచి సమయమని డిసైడ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు వాయిదా వేసిన అసలు కారణం ఇదేనన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది.