రిజల్ట్ రిలీజ్ డేట్… డెడ్ లైన్ గా పెట్టుకున్నారా?
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయంటున్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి [more]
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయంటున్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి [more]
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయంటున్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి గెలిచే అవకాశాలున్న రాష్ట్రాలు అసోం, పశ్చిమ బెంగాల్ మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్య పరిస్థితులు కన్పించడం లేదు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి మళ్లీ అవకాశాలున్నాయని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో అన్ని పార్టీలూ స్వరం మార్చే అవకాశముంది.
ప్రజల్లోనూ వ్యతిరేకత….
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. విభజన హమీలు అమలు పర్చకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో వైసీపీలో కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం పట్ల భ్రమలు తొలిగిపోతున్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న తెలంగాణలో మొన్నటి వరకూ కొంచెం సాఫ్ట్ గా ఉన్న అధికార టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసుకుంటున్నారు.
ఇక వినతులు కాదు…డిమాండ్లు….
బీజేపీ ఏపీలో బలపడేకొద్దీ భవిష్యత్ లో ఇబ్బంది తనకే తప్పదని వైసీపీ అధినేత జగన్ కు తెలియంది కాదు. అయితే ఆచితూచి వెళుతున్న జగన్ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై కొంత దూకుడుపెంచుతారంటున్నారు. ఇప్పటివరకూ వినతులకే పరిమితమైన జగన్ ఇకపై డిమాండ్లు పెట్టే అవకాశముంది. మోదీ ప్రభుత్వంపై క్రమంగా భ్రమలు తొలిగిపోతుండటంతో బీజేపీకూడా భవిష్యత్ లోమిత్రుల అవసరం ఉంటుంది. బలమైన వైసీపీని దూరం చేసుకునే అవకాశం ఉండదు.
వ్యతిరేక వాయిస్….
అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జగన్ కు వచ్చిన అవకాశంగా వైసీపీ నేతలే కొందరు వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన సమస్యల పరిష్కారానికి జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తారని, అప్పుడు కూడా స్పందన లేకుంటే జగన్ వ్యతిరేక వాయిస్ విన్పిస్తారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అందుకే జగన్ మరో రెండు నెలలు వెయిట్ చేయకతప్పదు. మే 3వ తేదీ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు.