మూడేళ్ళూ ఉంటే అడ్వాంటేజీ ఎవరికి…?
జగన్ ఫేక్ సీఎం, ఆయన మరో ఏడాదిలో కుర్చీ నుంచి దిగిపోతారు. అందువల్ల తమ్ముళ్ళూ భయపడకండి పోరాడండి, ఆ మీదట వచ్చేది మన ప్రభుత్వమే అని ప్రతీ [more]
జగన్ ఫేక్ సీఎం, ఆయన మరో ఏడాదిలో కుర్చీ నుంచి దిగిపోతారు. అందువల్ల తమ్ముళ్ళూ భయపడకండి పోరాడండి, ఆ మీదట వచ్చేది మన ప్రభుత్వమే అని ప్రతీ [more]
జగన్ ఫేక్ సీఎం, ఆయన మరో ఏడాదిలో కుర్చీ నుంచి దిగిపోతారు. అందువల్ల తమ్ముళ్ళూ భయపడకండి పోరాడండి, ఆ మీదట వచ్చేది మన ప్రభుత్వమే అని ప్రతీ రోజూ చంద్రబాబు తెగ ఊదరగొడుతున్నారు. బాబు ధైర్యం ఏంటి అంటే జమిలి ఎన్నికలు వస్తాయని. కానీ సీన్ చూస్తే అలా లేదు అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి సీన్ కాలిపోతున్న పరిస్థితి ఉంది. దాంతో అప్పనంగా 2019లో వచ్చిన అధికారాన్ని చివరి దాకా నిలబెట్టుకుని ఆ మీదటే జాతకాలు తేల్చుకోవాలని ఆ పార్టీ చూస్తోందిట. ఇది కనుక నిజమైతే టీడీపీకి పచ్చి చేదు వార్తే.
తట్టుకోలేరు…..
జగన్ అధికారంలోకి వచ్చి గట్టిగా రెండేళ్ళు కూడా కాలేదు. కానీ ఏపీలో టీడీపీని ఎక్కడికక్కడ కుదేల్ చేసి పరేశారు. ఆయన చేతిలో మరో మూడేళ్ళు పవర్ ఉంటేనా అసలు ఎవరూ తట్టుకోలేరు అన్న మాటే తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది. 2024లోనే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే జగన్ కి బోలెడంత అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పటికి పోలవరం పూర్తి అవుతుంది. విశాఖ రాజధానిగా స్థిరపడుతుంది. గాడి తప్పిన ఆర్ధిక పరిస్థితి కూడా ఒక దారిన పడుతుంది. అంతే కాదు జగన్ కి పాలన మీద మరింతగా పట్టు పెరుగుతుంది. ఇక టీడీపీని చెడుగుడు ఆడేందుకు మరింతగా టైం దొరుకుతుంది.
కౌంట్ డౌన్…..
తెలుగుదేశం పార్టీకి 2019లోనే కౌంట్ డౌన్ మొదలైంది. అది లోకల్ బాడీ ఎన్నికల దాకా కూడా కొనసాగింది. తిరుపతి ఉప ఎన్నికలో ఎటూ వైసీపీదే విజయం. ఆ మీదట ఏ ఒక్క ఎన్నికా కూడా ఏపీలో ఉండదు, జగన్ దూకుడుకు కూడా ఎవరూ అడ్డుచెప్పలేని స్థితి ఉంటుంది. దాంతో టీడీపీని 2024 నాటికి అసలు లేవకుండా జగన్ వేసే మాస్టర్ ప్లాన్ తో సైకిల్ పార్టులు ఉంటాయా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ పట్టుదల ఏంటో,ఆయన టార్గెట్ ఏంటో తొలి రెండేళ్లల్లో చూసిన టీడీపీ కి హ్యాండ్స్ అప్ అనడం తప్ప చేసేది కూడా ఉండదు అంటున్నారు.
అదే బెంగ….
ఇక్కడ మరో ప్రస్థావన కూడా వస్తోంది. 2024 ఎన్నికలు అంటే కచ్చితంగా మూడేళ్ల పై దాటి టైం ఉంది. చంద్రబాబు అప్పటిదాకా ఇదే సత్తువతో జోష్ తో ఉండగలరా అన్న సందేహాలు టీడీపీలోనే వ్యక్తం అవుతున్నాయట. ఇంతా చేసి చూస్తే జగన్ సీఎం సినిమా ఇంటర్ వెల్ కి కూడా రాలేదు. ఇపుడే ఇన్ని ట్విస్టులు ఉంటే క్లైమాక్స్ ఎలా ఉంటుందో అని తెలివైన తమ్ముళ్ళు ఆలోచిస్తూనే జడుసుకుంటున్నారుట. దీంతో ఏ మాత్రం టీడీపీ అధినాయకత్వంలో బెంగ కానీ కలవరం కానీ కనిపించినా టీడీపీ గూడు కుప్పకూలడం ఖాయమనే విశ్లేషణ వస్తోంది. మొత్తానికి మూడేళ్ళ అధికారం జగన్ కి ఉంటే మూడేది టీడీపీకే అన్నది కచ్చితం అని చెప్పేస్తున్నారు.