జగన్ మాటలనే అప్పజెబుతున్నారుగా..?
అవును మరి. రాజకీయం అంటే ఇదే. ఒకరిని అనడం సులువు. అదే ప్లేస్ కి మనం వస్తే మాత్రం ఆ విమర్శల బాణాలు మనకూ తగులుతాయి. చంద్రబాబు [more]
అవును మరి. రాజకీయం అంటే ఇదే. ఒకరిని అనడం సులువు. అదే ప్లేస్ కి మనం వస్తే మాత్రం ఆ విమర్శల బాణాలు మనకూ తగులుతాయి. చంద్రబాబు [more]
అవును మరి. రాజకీయం అంటే ఇదే. ఒకరిని అనడం సులువు. అదే ప్లేస్ కి మనం వస్తే మాత్రం ఆ విమర్శల బాణాలు మనకూ తగులుతాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా అంటూ నానా యాగీ చేసిన జగన్ ఇపుడు మాత్రం గప్ చిప్ అయ్యారని విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు ఓటమిని ఒక విధంగా ప్రత్యేక హోదా తేలేకపోవడం కూడా ప్రధాన కారణం. మరి దాన్ని మనసులో ఉంచుకున్న టీడీపీ జగన్ ని చెడుగుడు ఆడకుండా ఉంటుందా.
అవే డైలాగ్స్ తో దాడి…
జగన్ విపక్షనేతగా ఉన్నపుడు చంద్రబాబుని ఆయన వయసుని కూడా చూడకుండా హోదా తేకుండా ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అంటూ గట్టిగానే దబాయించేవారు. ఇపుడు అవే డైలాగ్స్ తో లోకేష్ జగన్ ని గుచ్చేస్తున్నారు. 28 ఎంపేలను ఇస్తే ఏం చేసారు, హోదా తేకుండా గాడిదలు కాస్తున్నారా అంటూ చినబాబు అంటున్న మాటలు వైసీపీ నేతలకు ఎక్కడో విన్నట్లే అనిపిస్తున్నాయట. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఒక కాగితం ముక్క రాసి పారేస్తే సరా, అది ఢిల్లీకి కూడా చేరలేదంటూ లోకేష్ ఎగతాళి చేస్తున్నారు.
బాబు ఫేస్ తో….
ఇపుడు జగన్ కూర్చున్నది బాబు ప్లేస్ లో సీఎంగా. ఇక బాబు ఫేస్ తో కూడా ఆయన్ని జనాలకు చూపించాలన్నదే టీడీపీ తాపత్రయం. మేము ఏమీ తేలేదని పక్కన పెట్టారు మరి 151 సీట్లు 22 మంది ఎంపీలను ఇచ్చి నెత్తిన పెట్ట్టుకున్న జగన్ ఏం చేస్తున్నారు అని జనాలని కూడా ఇండైరెక్ట్ గా టీడీపీ తమ్ముళ్ళు నిలదీస్తున్నారు. జగన్ పేరులోనే గన్ ఉందని, ఆయన అంటేనే ఒక పవర్ అని వైసీపీ నేతలు అప్పట్లో గొప్పలు చెప్పుకున్నారు. ఇపుడు దాని మీద కూడా చినబాబు లోకేష్ సెటైర్లు వేశారు. జగన్ గన్ లో బుల్లెట్లే లేవుట. అది డమ్మీ గన్ అనేస్తున్నారు.
అడకత్తెరలోనా….?
జగన్ పరిస్థితి నాటి చంద్రబాబు మాదిరిగానే ఉందా అంటే సమాధానం అవును అనే వస్తోంది. మిత్రుడిగా కాకుండానే బీజేపీకి జగన్ తలొగ్గి ఉంటున్నారు అన్న కామెంట్స్ ఉన్నాయి. అది నిజమనిపించేలా టీడీపీ హాట్ హాట్ కామెంట్స్ చేస్తోంది. జగన్ ఇపుడు సడెన్ గా ఢిల్లీని ఎదిరించలేరు అలాగని సైలెంట్ గా ఉండలేరు, ఇక ఏపీని నిలువునా వంచిస్తూ బీజేపీ పబ్బం గడుపుకుంటోంది. ఆ పార్టీకి ఇక్కడ కొత్తగా పోయేది ఏమీ లేదు. నోటా ఓట్లు తప్ప. అందుకే బీజేపీ దూకుడుతో టీడీపీ చెలగాటంతో జగన్ కార్నర్ అవుతున్నారు అంటున్నారు. మరి జగన్ లోని గన్ ఫైర్ అయితేనే తప్ప ఈ చెడుగుడు ఆగేట్టు లేదుగా.