జగన్ లో కూడా మార్పు వస్తుందట.. ఆ తర్వాత?
అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కళ్లు కన్పించవు. ఏదైనా ప్రజాగ్రహం వస్తే తప్ప తలవంచాలని అనిపించదు. అది ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే. ఎవరైనా తమకు ఎదురులేదనుకున్న [more]
అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కళ్లు కన్పించవు. ఏదైనా ప్రజాగ్రహం వస్తే తప్ప తలవంచాలని అనిపించదు. అది ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే. ఎవరైనా తమకు ఎదురులేదనుకున్న [more]
అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కళ్లు కన్పించవు. ఏదైనా ప్రజాగ్రహం వస్తే తప్ప తలవంచాలని అనిపించదు. అది ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే. ఎవరైనా తమకు ఎదురులేదనుకున్న సమయంలో ప్రజల నుంచి అసంతృప్తి ఎదురవుతుందని భావిస్తే నిర్ణయాలను వెనక్కు తీసుకోక తప్పదు. ఇప్పుడు వైఎస్ జగన్ సయితం ప్రజాభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారనే అనుకోవాలి. పార్టీ పరంగా, ప్రయివేటు పరంగా జరిపే సర్వేలు నిజం కావు. అసలైన సర్వే ఎన్నికల ఫలితాలే.
వరస ఎన్నికలు…..
ఇప్పుడు ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయి. తిరుపతి ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి జగన్ ప్రభుత్వం పనితీరుపై ఒక అంచనాకు వచ్చే అవకాశముంది. ప్రధానంగా ఆలయాలపై దాడులు, విపక్ష నేతలపై కేసులు, ఇసుక కొరత, అద్వాన్న స్థితిలో రహదారులు, అభివృద్ధి లేకపోవడం వంటి అంశాలు ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని చెప్పాలి. జగన్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం దీనిద్వారానే వెల్లడవుతుంది.
జగన్ కంటే మొండివారే…..
తెలంగాణలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ కంటే మొండిగా ఉండేవారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజాతీర్పు తర్వాత చాలా మార్పు వచ్చింది. అనేక నిర్ణయాలను కేసీఆర్ వెనక్కు తీసుకున్నారు. కేసీఆర్ లో ఈ మార్పును ఎన్నికలే తీసుకొచ్చాయి. అలాగే నరేంద్ర మోదీ సయితం మూడు రైతు చట్టాల విషయంలో చాలా వరకూ వెనక్కు తగ్గారనే చెప్పాలి. పలు దఫాలు చర్చలు జరిపారు. రైతుల ఆందోళనే ఇందుకు కారణం. చట్టాలను ఏడాది పాటు అమలు చేయబోమని చెప్పారు. తొలుత వ్యవసాయ చట్టాలపై మొండిపట్టు పట్టిన మోడీ సర్కార్ రైతుల ఆందోళనకు కొంత తలవంచక తప్పలేదు.
ఫలితాల తర్వాత….
రేపు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్ లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఇప్పటి వరకూ సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. అవే తనను గట్టెక్కిస్తాయని జగన్ నమ్ముతున్నారు. కొన్ని వర్గాలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి, పోలవరం అంశంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్నది దీనితో తేలిపోనుందంటున్నారు. పేరుకు పార్టీ రహితంగా ఎన్నికలే అయినా ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు జగన్ కు ఇది ఒక మంచి అవకాశమేనంటున్నారు.