నమ్మకం ఒక్కటే నిలబెట్టాలి
జగన్ అంటే ఒక నమ్మకం. అది మొన్నటి వరకూ లీడర్ లకు ఉండేది. జగన్ మాట ఇస్తే తప్పరని, ఎప్పటికైనా పదవి ఖాయమని నేతలు నమ్మబట్టే ఆ [more]
జగన్ అంటే ఒక నమ్మకం. అది మొన్నటి వరకూ లీడర్ లకు ఉండేది. జగన్ మాట ఇస్తే తప్పరని, ఎప్పటికైనా పదవి ఖాయమని నేతలు నమ్మబట్టే ఆ [more]
జగన్ అంటే ఒక నమ్మకం. అది మొన్నటి వరకూ లీడర్ లకు ఉండేది. జగన్ మాట ఇస్తే తప్పరని, ఎప్పటికైనా పదవి ఖాయమని నేతలు నమ్మబట్టే ఆ పార్టీ అధికారంలో లేని నాడు జగన్ వెంట అనేక మంది నడిచారు. జగన్ వెనక నిలబడ్డారు. నాయకులకు నమ్మకం కల్గించిన జగన్ గత ఇరవై నెలలుగా జనాలకు కూడా ఒకరకంగా నమ్మకం కలిగించాడు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత తాను ఇచ్చిన హామీలను అమలు పర్చేందుకే జగన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు.
70 వేల కోట్ల రూపాయలు…..
దాదాపు 70 వేల కోట్ల రూపాయలు ఈ ఇరవై నెలల్లో కోటి కుటుంబాల వరకూ వివిధ పథకాల కింద లబ్ది చేకూర్చారు. రైతుల దగ్గర నుంచి మహిళల వరకూ పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన నెలలకే కరోనా వచ్చింది. కరోనా సాకు చూపి సంక్షేమ పథకాలను నిలిపేయవచ్చు. ఎవరూ దానిని ప్రశ్నించరు. కానీ జగన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట తప్పలేదు.
ఎన్ని విమర్శలు వచ్చినా…..
అప్పులు తెచ్చి మరీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని విమర్శలు విన్పించవచ్చు. ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచిపెడుతున్నారన్న విపక్షాలు ఆరోపించవచ్చు. ఫైనల్ గా జగన్ తాను ఇచ్చిన మాట నిలుపుకున్నారా? లేదా? అన్నదే జనం చూస్తారు. నిజానికి ఎన్నికలకు నాలుగు నెలలకు ముందు చేయాల్సిన పనులను కూడా జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే చేయడం విశేషం.
రాజకీయంగా లబ్ది….
ఈ నమ్మకమే జగన్ కు రాజకీయంగా లబ్ది చేకూరుస్తుందంటున్నారు. చంద్రబాబు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలో ఉండగా అమలుపర్చలేకపోయారు. అయితే జగన్ మాత్రం ఇందులో భిన్నంగా వ్యవహరిస్తుండటం మాత్రం రాజకీయాల్లో డిఫరెంట్ గానే చెప్పుకోవాలి. అందుకే వివిధ అంశాలపై తనపైనా, తన ప్రభుత్వంపైనా విమర్శలు వస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు. తనపై ఉన్న నమ్మకమే తనకు తిరిగి విజయం తెచ్చిపెడుతుందన్నది జగన్ ధీమా కావచ్చు.