Sat Aug 13 2022 05:49:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ముహూర్తం చూసుకుని జగన్…!!!

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఈరోజు ఉదయం 10.20 గంటలకు విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో 75 మంది వరకూ స్థానం దక్కే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థులకే తొలి జాబితాలో చోటు కల్పించనున్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రతి జిల్లాకు నాలుగైదు స్థానాలను తొలి జాబితాలో ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే లోటస్ పాండ్ ఆశావహులతో కిక్కిరిసి పోయి ఉంది. ఈరోజు, రేపు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎల్లుండి జగన్ ఇడుపుల పాయకు వెళతారు. అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రచారానికి బయలుదేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చేరికలు ఇంకా ఉన్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచారు. వాటిిని రేపు, ఎల్లుండి ప్రకటించే అవకాశముంది.
Next Story