ప్రాక్టికల్స్ లేకనే ఈ ప్రాబ్లమా…!!

రాజకీయాల్లో పాఠాలు కాదు.. ప్రాక్టికల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాజకీయంగా ప్రజల్లో అభిమానం సంపాయించుకున్న నాయకులు కూడా తర్వాత పాలిటిక్స్ ప్రాక్టికల్స్‌లో పరాజయం పాలై.. ఇంటి ముఖం పట్టిన సంద ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే జనసేనలోనూ వినిపిస్తున్నాయి. సమున్నత లక్ష్యంతో రాజకీయా ల్లోకి వచ్చిన జనసేనాని పవన్.. తర్వాత తర్వాత జనసేనను రాజకీయ పాఠశాలగామార్చేశాడు. తనకు ఎవరెవరో ఆదర్శ మని, వారు చూపిన బాటలో నడుస్తానని లెక్చర్లు దంచాడు. అయితే, వాస్తవ పరిస్థితికి, రాజకీయాలకు మధ్య ఉన్న సన్న ని తేడాను ఆయన గుర్తించలేకపోయారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి.
పిడికట్టు పాలిటిక్స్……
వాస్తవాలు విరుద్ధంగా ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో కామన్‌గానే అప్పటికి అది ట్రెండ్గానే భావించాలి. సర్దుకుపోవాలి. అయితే, పవన్ మాత్రం పిడికట్టు రాజకీయాలు చేస్తున్నాడనే వ్యాఖ్యలు తరచుగా జనసేన గూటి నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తనకు మనసులో ఒక మాట ఉంచుకుని, పైకి మాత్రం సిద్ధాంతాలు మాట్లాడుతున్నారని అంటున్నారు. మొత్తా నికి పవన్ రాజకీయాలు ఆయనకేమైనా అర్ధమవుతున్నాయో లేదో కానీ పార్టీలోకి చేరదామనుకుంటున్న వారికి కూ డా అర్ధం కావడం లేదు. కొంత సేపు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చెబుతూనే ఇప్పటి వరకు కూడా పార్టీ నిర్మాణాన్ని ఆయన చేపట్టలేదు. అంతేకాదు, ఎప్పుడు పవన్‌కు ఎవరు శత్రువులు అవుతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
పంథా ఏమిటో…?
పాత సంగతులు తవ్వుతూ.. జగన్‌ను ఇటీవల ఏకేశాడు పవన్. అదేసమయంలో చంద్రబాబును ఒక్కమాట కూడా మాట్లా డలేదు. వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తానని, ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లోనూ పోటీ చేస్తానని చెప్పిన పవన్ ఈ విధమైన పంథా తీసుకోవడంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్‌కు కేసీఆర్ మద్దతుగా ఎందుకు మాట్లాడారని, కేవలం చంద్రబాబును తొక్కేయడానికే ఇలా చేస్తున్నారని పవన్ వ్యాఖ్యానించాడు. అయితే, కేసీఆర్ ఓ రేంజ్లో తిట్టిపో శాక.. ఆయనతోనే చెలిమికి సిద్ధమైన బాబు గురించి ఒక్కమాట అనలేదు. ఓటుకు నోటు వ్యవహారంపై మాట్లాడలేదు. అంతేకాదు, రాష్ట్రానికి హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అయినా కూడా దానినో పరాయి ప్రాంతంగా మనకు ఏమీ సంబంధం లేనట్టుగా చంద్రబాబు చూడడం, జగన్ వెళ్లి తనపై విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలను రాజకీయాలకు వాడుకోవాలని చూడడం వంటివి పవన్‌కు కనిపించకపోవడంపై ఇప్పుడు విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. మొత్తం ఈ ఎపిసోడ్లో పవన్ రాజకీయంగా ప్రాక్టికల్స్‌లోకి కూడా అడుగు పెట్టలేదని అంటున్నారు విశ్లేషకులు. మరి ఎలా ముందుకువెళ్తాడో చూడాలి.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±