కీలకనేత తెరమరుగయ్యారా?
రాజకీయాల్లో బళ్లు ఓడలు కావడం, ఓడలు బళ్లు కావడం అనేది సర్వసాధారణం. ఎవరు ఎప్పుడు ఎలివేట్ అవుతారో. ఎవరు ఎప్పుడు తెరమరుగు అవుతారో చెప్పడం కష్టం. నాయకులకు [more]
రాజకీయాల్లో బళ్లు ఓడలు కావడం, ఓడలు బళ్లు కావడం అనేది సర్వసాధారణం. ఎవరు ఎప్పుడు ఎలివేట్ అవుతారో. ఎవరు ఎప్పుడు తెరమరుగు అవుతారో చెప్పడం కష్టం. నాయకులకు [more]
రాజకీయాల్లో బళ్లు ఓడలు కావడం, ఓడలు బళ్లు కావడం అనేది సర్వసాధారణం. ఎవరు ఎప్పుడు ఎలివేట్ అవుతారో. ఎవరు ఎప్పుడు తెరమరుగు అవుతారో చెప్పడం కష్టం. నాయకులకు ప్రతి నిత్యం ఓ పరీక్షే! నేడు ఉన్న హవా రేపు ఉంటుందనే గ్యారెంటీ లేదు. ప్రజామోదం ఉంటేనే పాలకులకైనా.. నాయకులకైనా.. కాలం కలిసి వచ్చేది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటు, విభజన ఉద్యమం వంటి వాటిలో కీలకంగా ఉండి.. రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేసిన వారు.. తర్వాత కాలంలో టీఆర్ ఎస్‌కు, కేసీఆర్ కు కూడా మద్దతుగా నిలిచారు. అయితే, వారంతా ఇప్పుడు పట్టుమని ఐదేళ్ల కాలంలోనే తెరమరుగ వుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
కేసీఆర్ కు సన్నిహితంగా….
ముఖ్యంగా కేసీఆర్‌కు కుడి భుజంగా ఆది నుంచి ఉన్న నాయిని నరసింహారెడ్డి.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా వారిపై బహిరంగ విమర్శలకు దిగారు. కేసీఆర్‌ను అన్నివిధాలా బలోపేతం చేశారు. తెలంగాణ వచ్చేందుకుగాను తనదైన శైలిలో కృషి చేశారు. ఈ క్రమంలోనే కార్మిక సంఘాలను కూడా ఆయన ఉద్యమ బాటపట్టించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మారారు నాయిని. రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొలి ప్రభుత్వంలో నాయినికి అత్యంత గౌరవం దక్కింది. రాష్ట్ర హోం మంత్రిగా నాయినినే నియమించడం ద్వారా తనను నమ్మిన వారికి పెద్ద పీట వేస్తాననే సంకేతాలను కేసీఆర్ పంపారు.
గౌరవం దక్కుతుందనుకుంటే….
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు నాయినికి మంచి గౌరవం దక్కడం ఖాయమని ఈ క్రమంలోనే అందరూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో నాయినికి అనారోగ్య కారణంగా కేసీఆర్ టికెట్ కేటాయించలేదు. ఈ క్రమంలో తన అల్లుడికైనా టికెట్ ఇవ్వాలని నాయిని పట్టుబట్టారు. కానీ, కేసీఆర్ వ్యూహాత్మకంగా ముఠా గోపాల్‌ను రంగంలోకి దింపి.. రాజకీయాలను యూటర్న్ చేశారు. దీంతో అప్పటి వరకు నిత్యం ఏదో ఒక రూపంలో మీడియాలో కనిపించే నాయిని.. అటు టీఆర్ఎస్ భవన్ సహా ఇటు మీడియాలో కూడా ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి ఏ కార్యక్రమానికైనా .. కేసీఆర్ వెంట ఉండేవారిలో నాయిని ఒకరు.
ఎక్కడా కన్పించక…..
కానీ, తొలి నాలుగున్నరేళ్ల పాలన తర్వాత కేసీఆర్ అనూహ్యంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా.. చాలా మంది నాయకులకు కేరాఫ్ లేకుండా పోయింది. ఇలాంటి వారిలో నాయిని నరసింహారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి? ఈయనకు వారసుడుగా రంగంలోకి దింపాలని భావించిన అల్లుడికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో నాయిని రాజకీయాలకు ఇక తెరపడిందా అనే కోణంలో రాజకీయాలు సాగుతున్నాయి. నాయినికి రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు మాదిరిగానే నాయకుల తలరాతలు కూడా అనూహ్యంగా మారుతుండడం గమనార్హం.