బాబులో కాన్ఫిడెన్స్ పెరిగింది అందుకేనా…??

అవును! వచ్చే ఎన్నికలను ప్రభావితం చేయగల అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబు బాగానే అందిపుచ్చుకున్నారు. తాను అధికారంలో ఉన్నాను కాబట్టి.. తాను సాధించిన విజయాల తాలూకు లిస్టును ఆయన ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్నా రు. మరి ప్రధాన విపక్షం వైసీపీ దగ్గరకానీ, జనసేన దగ్గర కానీ. ఏమున్నాయి? చెప్పుకోవడానికి? అనేది ప్రధాన విషయం. అత్యంత కీలకమైన ఎన్నికలు ఏపీలో ఆవిష్కృతం కానున్నాయి. బహుశ చంద్రబాబు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన ఎన్నికలు కూడా ఇవే కావొచ్చు. గత ఎన్నికల్లో బలమైన ప్రజాదరణ, యూత్‌ను తనవైపు తిప్పుకోగల స్టార్‌గా ఉన్న పవన్ చంద్రబాబు కు అందివచ్చారు. అదే సమయంలో బలమైన ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని కూడా చంద్రబాబు ప్రజలకు పరిచయం చేశారు.
ఇప్పుడు ఆ పరిస్థితి ఏదీ…?
ఇవన్నీ కూడా అప్పట్లో బాబుకు ప్లస్ అయ్యాయి. ఇక, ఇప్పుడు మాత్రం ఈపరిస్థితి లేదు వారితో చంద్రబాబు తీవ్రస్థాయి లో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో చంద్రబాబుకు ఉన్న అండా దండా కాంగ్రెస్ మాత్రమే. అయితే, ఏపీలో కాంగ్రెస్‌ను ఎవరు ఆదరిస్తారు? ఎవరు కాంగ్రెస్ మాటలను నమ్ముతారు? తెలంగాణాలో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్‌కు ఏపీలో మాత్రం రాత్రికిరాత్రి బలం వస్తుందా ? అనేదిప్రధాన ప్రశ్న. దీనిపై దృష్టి పెట్టిన చంద్రబాబుగడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి తాను చేసిన అభివృద్ధి రికార్డులను తిరిగి తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీటినే ఆయన ప్రజల ముందు ఉంచబోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలను కూడా గుదిగుచ్చుతున్నారు. ప్రధానంగా జగన్ ఏ హామీలనైతే ప్రజలకు చేస్తున్నారో. వాటిని తాను చేసి చూపించానని ప్రజల్లోకి వెళ్తున్నారు.
అన్నివర్గాలనూ….
ప్రకృతి విపత్తులు మొదలుకుని.. ఏ సంక్షేమ కార్యక్రమం వరకైనా తన ప్రభుత్వం ఎంతగా స్పందించిందో వివరించేందు కు ఇప్పటికే ఓ టీంను రెడీ చేసుకున్నారు. ఇక, రాష్ట్రంలోని ప్రతి కులానికీ తాను కార్పొరేషన్ ఏర్పాటు ఏస్తానని జగన్ ఇటీవల చెప్పారు. అయితే, తాను ఇప్పటికే అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి .. కోట్ల రూపాయలు నిధులు కూడా సమకూర్చానని, ఇంతకన్నా జగన్ చేయడానికి ఏముంటుందని బాబు చెబుతున్నారు. చెప్పబోతున్నారు. అదే సమయంలో ముస్లిం వర్గాలను ఆకర్షించేందుకు ఇప్పటికే నలుగురు కీలక నాయకులకు బాబు పదవులు ఇచ్చారు. మక్కా వెళ్లేందుకు నిధులు పెంచారు. ముస్లిం విద్యార్థుల చదువుకు నిదులు, పెళ్లిళ్లకు కానుకలు ఇలా ఒక్కటనేముంది సమాజంలోని ప్రతి వర్గానికి చంద్రబాబు ఏదో ఒకటి చేస్తున్నారు.
ఆయుధాలు ఇంకా ఉన్నాయని….
ఇలా బాబు దగ్గర చాలా ఆయుధాలే ఉన్నాయి. మరి ఇక్కడే విపక్షం వైసీపీ సహా జనసేన అధినేత పవన్ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? అనేది బాబును వేస్తున్న ప్రశ్న. ప్రజల తరఫున పోరాడాల్సిన జగన్ సభలకు వెళ్లడం లేదు. పాదయాత్ర మాత్రం చేస్తున్నారు. మరి ఏముందని చెప్పుకొనేందుకు? మేం విపక్షంలో ఉన్నా.. ప్రజల తరఫున పోరాడి కేసులు పెడితే.. జైలుకు వెళ్లామని చెప్పుకొని సింపతీ ఓట్లు రాబట్టుకునే అవకాశాన్ని సైతం జగన్ కోల్పోయారన్నది బాబు ధీమా. ప్రత్యేక హోదా విషయాన్ని పట్టుకున్నట్టే పట్టుకుని ఠక్కున వదలేశారని ప్రచారం ప్రారంభించారు. ఇక, జనసేనాని విషయమూ ఇంతే. పాచిపోయిన లడ్డూలను కాదన్న ఆయన హాట్ లడ్డూల కోసం ప్రయత్నించలేదు. అసలు ఇప్పటికే కేడర్ లేదు. సో.. ఇవన్నీ బేరీజు వేసుకుంటే. బాబు వద్ద చాలానే ఆయుధాలు ఉన్నాయని అంటున్న తమ్ముళ్ల మాట. మరి బాబుది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±