జమిలీ వస్తే ఇద్దరు చంద్రులు అవుట్ ..?
ప్రధానమంత్రి మోదీ తొలి టర్మ్‌లోనే జమిలీ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో ఎన్నో సంచలనానికి కారణమయ్యాయి. ఆ తర్వాత జమిలీ ఎన్నికలపై ఆయన మౌనంగా [more]
ప్రధానమంత్రి మోదీ తొలి టర్మ్‌లోనే జమిలీ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో ఎన్నో సంచలనానికి కారణమయ్యాయి. ఆ తర్వాత జమిలీ ఎన్నికలపై ఆయన మౌనంగా [more]
ప్రధానమంత్రి మోదీ తొలి టర్మ్‌లోనే జమిలీ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో ఎన్నో సంచలనానికి కారణమయ్యాయి. ఆ తర్వాత జమిలీ ఎన్నికలపై ఆయన మౌనంగా ఉన్నా ఇటీవల మరోసారి జమిలీ ఎన్నికల ఆవశ్యకతను పలకడంతో మళ్లీ జమిలీ ఎన్నికల గురించే జాతీయ రాజకీయ వర్గాల్లో బలమైన చర్చలు నడుస్తున్నాయి. వాస్తవంగా చూస్తే దేశవ్యాప్తంగా 2024లో లోక్‌సభ ఎన్నికలు వస్తాయి. అయితే ఇప్పుడున్న జమిలీ అంచనాల నేపథ్యంలో 2022లోనే జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు.
ఖచ్చితంగా వస్తాయని…..
మోదీ జమిలీ ప్రస్తావన తేవడానికి ముందే మాజీ సీఎం చంద్రబాబు జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ నేతలు అందరూ సిద్ధంగానే ఉండాలని సూచనలు చేశారు. మోదీతో పాటు కేంద్ర వర్గాల్లో జమిలీపై ఎప్పటికప్పుడు చర్చలు నడుస్తున్న విషయం చంద్రబాబుకు ముందుగా లీక్ కావడంతోనే ఆయన తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. జమిలీ ఎన్నికల నేపథ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని కుదించడం, మరికొన్ని రాష్ట్రాల కాలపరిమితిని పెంచడం కూడా చేస్తారని టాక్.
జగన్ కు సానుకూలమే…
జమిలీపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుల పొలిటికల్ కెరీర్‌కు ఈ ఎన్నికలే శుభం కార్డు వేస్తాయా ? అన్నదానిపై కూడా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఏపీలో చూస్తే ఇప్పటకీ జగన్ పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయమే ఉంది. చిన్నాచితకా వ్యతిరేకత ఉన్నా అది జగన్‌ను అధికారం నుంచి దూరం చేసేంత స్థాయిలో ఉంది. జగన్ సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి పెడుతూ పాలన కొనసాగిస్తున్నారు. ప్రజలందరికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి జరుగుతోంది. ఇక అమరావతి అంశం రాష్ట్రం అంతటా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది.
టీడీపీకి కష్టకాలమే….
ఇక చంద్రబాబు, ఆయన తనయుడు హైదరాబాద్‌లోనే ఉంటూ రాజకీయం చేస్తుండడం, ఇటు టీడీపీ వాళ్లకు కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశలు లేకపోవడం ఇలా ఎన్నో కారణాలు జగన్‌కు సానుకూలాంశాలు. జగన్ ఇదే పాజిటివ్ వేవ్‌ను మరో యేడాదిన్నర కంటిన్యూ చేసుకుంటూ జమిలీలో సత్తా చాటడం సులువే. అదే జరిగితే జగన్‌కు మరో ఐదేళ్లు అధికారం ఉంటుంది. ఇక రాజకీయంగా చరమాంక దశలో ఉన్న చంద్రబాబు మరో ఏడేళ్ల తర్వాత వరకు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండి సత్తా చాటుతారని ఆశించడం అత్యాశే అవుతుంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు పార్టీని అధికారంలోకి తేవడం అసాధ్యమైన పరిస్థితే.
తెలంగాణలో కేసీఆర్…..
ఇక తెలంగాణ చంద్రుడు సీఎం కేసీఆర్‌కు కూడా జమిలీ కష్టాలు తప్పేలా లేవు. కేసీఆర్ వరుసగా రెండోసారి సీఎం అయ్యాక ఆయన తీరులో మార్పు వచ్చిందని తెలంగాణ ప్రజానీకమే తమ ఓటుతో చెపుతున్నారు. తెలంగాణ అధికారం కోసం బీజేపీ కాచుకుని కూర్చొని ఉంది. తెలంగాణ ప్రజానికానికి కూడా కేసీఆర్‌పై ఉన్న మబ్బులు క్రమక్రమంగా తొలగుతున్నాయని దుబ్బాక, తాజాగా గ్రేటర్ ఎన్నికల ఫలితాలే రుజువు చేస్తున్నాయి. అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ శరవేగంగా పడిపోతూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ తన రాజకీయ వారసత్వాన్ని కేటీఆర్‌కు ఇస్తే అది గులాబీ పార్టీలో పెను ముసలానికి కూడా దారితీయడం.. దీనిని బీజేపీ మరింతగా క్యాష్ చేసుకోవడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
బీజేపీ మెయిన్ టార్గెట్…..
ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీ మెయిన్ టార్గెట్ తెలంగాణ. ఇక్కడ ఆ పార్టీ పాగా వేస్తే బీజేపీ చేతుల్లో నుంచి అధికారం లాక్కోవడం అంత సులువు కాదు. ఈ విషయం తెలిసే కేసీఆర్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉడికిపోతున్నారు. కుమారుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలకు వెళ్లాలనుకుంటున్నా బీజేపీకి తానే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందన్న భయం కూడా ఆయన్ను వెంటాడుతోంది. ఇటు పార్టీలో వారసత్వ సమస్య ఎప్పటికైనా ఉండనే ఉంది. ఈ పరిణామాలతో జమిలీ ఎన్నికల్లో రిజల్ట్ తేడా వస్తే ఆ తర్వాత కేసీఆర్ ఫ్యూచర్ ముగిసే రోజు ఎంతో దూరంలో లేనట్టే. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు ఇద్దరు చంద్రులను బాగా టెన్షన్ పెడుతోన్నాయన్నది అంగీకరించాల్సిందే.