Thu Jun 30 2022 17:43:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీలోకి బలం..బలగమున్న నేత…!!

తెలుగుదేశం పార్టీలోకి మరో బలమైన నేత రానున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. చిత్తూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీకేబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళదామనుకున్నా అక్కడి పరిస్థితులు అనుకూలించలేదు. తర్వాత సీకే బాబు బీజేపీలో చేరారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. చివరకు రెండు రోజులుగా తన అనుచరులతో సమావేశం నిర్వహించిన సీకే బాబు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. సీకే బాబు చేరికతో చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పెరిగినట్లే.
Next Story