టిక్కెట్ ఇస్తే ఓడిపోతారని చెబుతున్నా…?
అదేంటి అనుకుంటున్నారా? రాజకీయాల్లో అంతే కదా! ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పాలిటిక్స్‌లో మనం ఉన్నాం. తమ పంతం నెగ్గించుకునేందుకు నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. [more]
అదేంటి అనుకుంటున్నారా? రాజకీయాల్లో అంతే కదా! ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పాలిటిక్స్‌లో మనం ఉన్నాం. తమ పంతం నెగ్గించుకునేందుకు నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. [more]

అదేంటి అనుకుంటున్నారా? రాజకీయాల్లో అంతే కదా! ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పాలిటిక్స్‌లో మనం ఉన్నాం. తమ పంతం నెగ్గించుకునేందుకు నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కుదిరితే.. కాళ్లు.. లేకపోతే.. జుట్టు పట్టుకునేందుకు సైత నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పార్టీల అధినాయకులు వారిని వదిలించుకోలేక, వారి కోరికలు తీర్చలేక నానా హైరానా పడుతున్నారు. ప్రధానంగా ఇలాంటి కేసులు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎక్కు వగా ఉన్నాయి. కేబినెట్లో కీలకంగా నెంబర్ టూగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి వచ్చే ఎన్నికలకు సంబందించి టికెట్ విషయంలో చంద్రబాబు చెవిలో జోరీగగా మారిపోయారట. ఇప్పుడు ఈ విషయంలో అమరావతిలోనే కాకుండా పార్టీలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఈసారి గెలిచే పరిస్థితి…..
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ సీనియర్ నాయకుడు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. గతంలో కీలక మైన పదవులు కూడా అనుభవించారు. అయితే, తనను ఎన్నుకొన్న ప్రజలను చులకన చేయడంతో వరుస విజయాలను అందించిన ప్రజల కష్టాలను పట్టించుకోక పోవడం వారు ఏకంగా ఈయనను వరుసగా డింకీలు కొట్టిస్తున్నారు. దీంతో విసిగిపోయిన సదరు సీనియర్ గత ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుడిని రంగంలోకి దింపి ప్రజలను మాయ చేయాలని చూశారు. అయితే ఈ ఫ్యామిలీపై గుర్రుగా ఉన్న ప్రజలు.. వీరి వసూళ్లు, దందాలతో విసిగిపోయిన వ్యాపారులు కూడా మూకుమ్మడిగా ఓడించారు. దీంతో ఆ నియోజకవర్గంలో అసలు ఈ కుటుంబం పేరు శాశ్వతంగా వినిపించే పరిస్థితి కూడా లేకుండా పోతోందని సర్వేలు చాటుతున్నాయి.
పట్టుబడుతున్న మంత్రి…..
ఈ క్రమంలో బలమైన నాయకుడిని అక్కడ నిలబెట్టి.. గతంలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును మళ్లీ పదిలం చేసుకునేం దుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే.. గెలుపు గుర్రం ఎక్కుతారు? అనే విషయంపై ఆయన సర్వేలు కూడా చేయించారు. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు. అయితే, సదరు మంత్రి మాత్రం తన కుటుంబానికి గెలిచే సత్తా ఉందని, ఈ సారి మాత్రం గెలిచి తీరుతానని, వచ్చే ఎన్నికల్లో కూడా మాకే ఇవ్వండి.. ఈ సారి గెలుపు ఖాయమని ఒత్తిడి తెస్తున్నారు. కానీ, ఈ ఫ్యామిలీ నుంచి ఎవరిని నిలబెట్టినా.. పోయి పోయి టికెట్‌ను చేజార్చుకున్నట్టే అవుతుందని సర్వేలు చాటుతున్నాయి. దీంతో ఇటు సర్వేల ప్రకారం ముందుకు వెళ్లలేక, ఆ మంత్రిని కాదనలేక చంద్రబాబు సతమతం అవుతున్నారని సమాచారం. సైంధవుడు అంటే ఇంతకన్నాఏంకావాలి! అంటున్నారు కేబినెట్ సహచరులు. నిజమే కదా!!
- Tags
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- senior minister
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
- à°¸à±à°¨à°¿à°¯à°°à± à°®à°à°¤à±à°°à°¿