బాబును రెచ్చిపోమంటున్న మోడీ….?
అవును. సీన్ చూస్తే అలాగే ఉంది. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం క్లైమాక్స్ ఎప్పటికీ చేరుకోవడంలేదు. కేంద్ర పెద్దలకు అర్జంటుగా ఇందులొ ఒకరు [more]
అవును. సీన్ చూస్తే అలాగే ఉంది. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం క్లైమాక్స్ ఎప్పటికీ చేరుకోవడంలేదు. కేంద్ర పెద్దలకు అర్జంటుగా ఇందులొ ఒకరు [more]
అవును. సీన్ చూస్తే అలాగే ఉంది. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం క్లైమాక్స్ ఎప్పటికీ చేరుకోవడంలేదు. కేంద్ర పెద్దలకు అర్జంటుగా ఇందులొ ఒకరు పాలిటిక్స్ నుంచి అవుట్ కావాలి. 2019లో దానికి బీజాలు పడినా ఓటమిని అంత తేలికగా అంగీకరించని చంద్రబాబు ఇప్పటికీ అలుపెరగని పోరాటమే చేస్తున్నారు మరో వైపు వైసీపీ కూడా తన రాజకీయ చాణ్యాక్యాన్ని చూపిస్తోంది. ఏపీలో సంక్షేమంతో పదికాలల పాటు పదిలంగా ఉండాలనుకుంటోంది. ఇక అదను కోసం వేచి వేసారుతున్న బీజేపీకి అవకాశం ఉన్నదల్లా ఏంటి అంటే ఈ రెండు పార్టీల మధ్య ఎప్పటికపుడు చిచ్చు రాజేయడమే.
మరీ అంత అర్జంటుగా…
దేశంలో ఎన్నో స్టీల్ ప్లాంటులు ఉన్నాయి. అలాగే అనేక ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలనుకున్నా మరీ ఇంత అర్జంటుగా చేయాల్సిన సీన్ ఏదీ లేదు. ఒకవేళ దానికి పూనుకున్నా ఏపీ జనాలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసిన మీదట ఏపీ సర్కార్ వైఖరిని గమనించిన మీదట కనీసం ఆ ప్రతిపాదనను కొంతకాలమైనా వాయిదా వేసుకున్నా కూడా జగన్ కి మేలు జరిగేది. కానీ ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా మోడీ సర్కార్ దూకుడు చేస్తోంది అంటే జగన్ ని బదనాం చేయడానికే అని కచ్చితంగా తెలిపోతోంది అంటున్నారు.
జగన్ మీదకు అలా…
దాంతో జగన్ మీదకు విపక్ష తెలుగుదేశం పార్టీని మోడీ కోరి మరీ వదిలిపెట్టారనే మాట వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యేకించి ఎవరి మీద ఎటువంటి ప్రేమలూ లేవు, ఆ మాటకు వస్తే దశాబ్దాలుగా తనతో కలసి వచ్చిన శివసేన లాంటి మిత్రులనే వదులుకున్న మోడీకి ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు. తమ రాజకీయ రధం దూకుడుగా సాగేందుకే బీజేపీ చూస్తుంది. తన దోవకు అడ్డం వచ్చిన వారిని కఠినంగానే పక్కకు తొలగిస్తుంది. ఇదే రాజకీయ నీతి అని కూడా అంటారు. ఇపుడు జగన్ ఏపీలో బలంగా ఉన్నారు. ఆయన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అంటే జనాల్లో పలుచన చేయాలి. దానికి అవసరమైన ఇంధనంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకువచ్చిందని అంటున్నారు.
చంద్రబాబు చెడుగుడే….
ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఈ అంశంతో ఇక చెడుగుడు ఆడుకోమన్నట్లుగా చంద్రబాబును పొలిటికల్ గ్రౌండ్ లోకి వదిలేశారు అంటున్నారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో జగన్ బాబుని బాగానే ఆడుకున్నారు. టీడీపీ ఎంపీల రాజీనామాకు డిమాండ్ చేసారు. చంద్రబాబుని అన్ని రకాలుగా కార్నర్ చేసి జనం ముందు దోషిగా నిలబెట్టారు. ఇపుడు అదే ఫార్ములాను చంద్రబాబు కూడా అనుసరిస్తున్నారు. బాబు సీనియర్ నేత కనుక ఎంపీల రాజీనామాలతో వదలడం లేదు. ఏకంగా జగన్నే రాజీనామా చేయమంటున్నారు. ఏపీలో జగన్ ఫెయిల్యూర్ సీఎం అంటున్నారు. కొత్తవి కేంద్రం నుంచి సాధించేది లేకపోగా ఉన్నవి కూడా కాకుండా చేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి చూస్తూంటే హోదా సెంటిమెంట్ సెగలా మారి బాబుని గద్దె దింపింది, ఇపుడు ఉక్కు మంటలు జగన్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చిత్రమేంటంటే నాడూ నేడూ అసలైన ముద్దాయి అయిన బీజేపీ మాత్రం హ్యాపీగా ఏపీ పాలిటిక్స్ ని చూస్తోంది.