అపాత్ర దానం చేశానా? బాబులో అంతర్మదనం
తెలుగుదేశం పార్టీ నిస్సహాయ స్థితిలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తన వెంట ఉన్న వాళ్లంతా పదవులు అందుకుని ఆ తర్వాత వదిలి పెట్టి వెళుతుండటం ఇబ్బందికరంగా మారింది. [more]
తెలుగుదేశం పార్టీ నిస్సహాయ స్థితిలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తన వెంట ఉన్న వాళ్లంతా పదవులు అందుకుని ఆ తర్వాత వదిలి పెట్టి వెళుతుండటం ఇబ్బందికరంగా మారింది. [more]
తెలుగుదేశం పార్టీ నిస్సహాయ స్థితిలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తన వెంట ఉన్న వాళ్లంతా పదవులు అందుకుని ఆ తర్వాత వదిలి పెట్టి వెళుతుండటం ఇబ్బందికరంగా మారింది. శాసనసభలో తగిన బలం లేకపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే అది వైసీపీ ఖాతాలోనే పడుతుంది. నేతలకు ఇప్పుడు చంద్రబాబు పార్టీ పదవి తప్ప ఏ పదవిని ఇచ్చే పరిస్థితుల్లో లేరు. రెండు ఎమ్మెల్సీలు తన చేతి మీద నుంచి అందుకుని తిరిగి వైసీపీ ఖాతాలో చేర్చుతుండటం ఆయనను ఆలోచనలో పడవేసిందంటున్నారు.
నమ్మకమైన నేతలే…..
నమ్మకమైన నేతలు అనుకున్న వాళ్లే పార్టీని వీడివెళుతుండటంతో ఇకపై ఆర్థికంగా కాకుండా పార్టీ పట్ల విశ్వాసం ఉన్న వారికే పదవులను కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఇచ్చారు. అప్పటికప్పుడు పార్టీ మారి వచ్చిన నేతకు పదవి ఇవ్వడంపై పలువురు సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు.
పార్టీ పట్ల …..
రాయపాటి సాంబశివరావు సిఫార్సుతో డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ అధికారం కోల్పోయిన వెంటనే ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక పోతుల సునీతది కూడా అదే దారి. బీసీ కోటా కింద చంద్రబాబు పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభించలేదని భావించిన పోతుల సునీత టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు.
భవిష్యత్ లో…..
ఇప్పుడు మరోమారు ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. శాసనసభ్యుల కోటాలో జరిగే ఈ ఎన్నిక ఏకపక్షంగా జరగనుంది. వైసీపీకే మళ్లీ ఎమ్మెల్సీ దక్కనుంది. ఇప్పుడు చంద్రబాబు లో అంతర్మధనం మొదలయిందంటున్నారు. తాను అపాత్రదానం చేశానంటూ సీనియర్ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారట. ఇకపై పదవుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, అన్ని కోణాల్లో అందరి సూచనలు తీసుకున్న తర్వాతనే పదవుల పంపకం ఉంటుందని ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద ఎన్నికలొస్తుంటే చంద్రబాబు లో అంతర్మధనం మొదలవుతుందన్న అభిప్రాయం పార్టీ నేతల నుంచి వినపడుతుంది.