Wed Jun 29 2022 06:01:30 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ నటుడు సతీష్ దారుణ హత్య

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. జూన్ 18, శనివారం నాడు బెంగళూరులోని పట్టనగెరె ప్రాంతంలోలో ఒక నటుడిని అతని బావమరిది కత్తితో పొడిచి చంపారు. మృతుడిని సతీష్ వజ్రాగా గుర్తించారు పోలీసులు. కుటుంబ కలహాలతో సతీష్‌ను అతని భార్య సోదరుడు తన ఇంట్లోనే హత్య చేసినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం సతీష్ భార్య ఆత్మహత్యకు పాల్పడి ఉండటమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సతీష్ షార్ట్ ఫ్లిలిమ్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించి తద్వారా కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా ఛాన్స్ అందుకున్నాడు. 'లగోరి' అనే కన్నడ చిత్రంలో సహాయక పాత్రను కూడా పోషించాడు. మండ్యలోని మద్దూరుకు చెందిన సతీష్ కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అతని భార్య ఏడు నెలల క్రితం మృతి చెందింది. ఆమె మరణించడానికి సకాలంలో వైద్యం అందకపోవడమే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సతీష్ వజ్ర మండ్య ప్రజ్వల్ దేవరాజ్ అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అలాగే ఒక పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క సెలూన్‌ను కూడా నడుపుతున్నాడు. సతీష్ కస్టమర్లలో కొందరు సినిమా నటులు కూడా ఉన్నారని అంటున్నారు. సతీష్ బసవన్న గుడి సమీపంలోని పట్టనగెరెలో నివాసం ఉండేవాడు. అక్క ఆత్మహత్యకు ఆమె భర్త సతీష్ వజ్ర కారణమని ఆమె సోదరుడు భావించాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సతీష్ ఇంట్లోకి చొరబడి దాడి చేసి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సతీష్ అత్తమామలు అతని భార్య మరణానికి కారణమని, అతను ఆమెను హింసించాడని చెప్పాడు. ఆమె మరణానంతరం, బిడ్డను ఆమె కుటుంబ సభ్యుల సంరక్షణకు అప్పగించారు. సతీష్ అప్పుడప్పుడూ ఆ చిన్నారిని చూసేందుకు అక్కడికి వెళ్లేవాడు. అతను పిల్లల కస్టడీ కోసం ప్రయత్నించడం కూడా గొడవకు దారితీసింది.
Next Story