15ఏళ్ల మైనర్ బాలికను లోబరుచుకుని.. మూడు నెలలుగా
మాయమాటలు చెప్పి బాలికతో పరిచయం పెంచుకున్న అతడు గత మూడునెలలుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లాలో ఓ మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాపట్ల జిల్లాలోని కొరిశపాడు మండలంలో రావిపాటి కోటయ్య వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. పెళ్ళయి భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే కోటయ్య అదే గ్రామానికి చెందిన 15ఏళ్ల మైనర్ బాలికను లోబరచుకున్నాడు. తండ్రిదండ్రులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో బాలిక అమ్మమ్మ వద్దే వుంటోంది. దీంతో మాయమాటలు చెప్పి బాలికతో పరిచయం పెంచుకున్న అతడు గత మూడునెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొందంటూ బెదిరించడంతో బాలిక అలాగే చేసింది. ఇటీవల కోటయ్య వికృతచేష్టలు మరీ ఎక్కువ కావడంతో బాలిక భరించలేకపోయింది. తనవద్దకు తల్లిదండ్రులు వచ్చిన సమయంలో ఈ విషయాన్ని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే పోలీసులు పోక్సో చట్ట కింద బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వాలంటీర్ పై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం వాలంటీర్ కోటయ్య పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. బాలికను కూడా వైద్యపరీక్షల కోసం ఒంగోలు రిమ్స్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.